జాతీయ వార్తలు

హైకోర్టు తీర్పు మరో రెండు వారాల నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: రిజర్వేషన్ సౌకర్యం లేని కులాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను కొట్టివేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలును సుప్రీంకోర్టు సోమవారం మరో రెండు వారాలు పొడిగించింది. ఈ నెల 4న ఆర్డినెన్స్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేయడానికి వీలుగా తన తీర్పు అమలును నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్, న్యాయమూర్తులు ఎఎం ఖన్‌విల్కర్, డివై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన స్టేను మరో రెండు వారాలు పొడిగించింది. ఈ కేసు తదుపరి విచారణ తేదీ వరకు స్టే ఆర్డర్‌ను పొడిగించాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి చేసిన విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం స్టేను పొడిగించింది. గుజరాత్ ప్రభుత్వం అన్‌రిజర్వుడ్ కులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఇబిసి)కు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. రిజర్వేషన్ల కోసం పటేల్ కులస్థులు చేసిన ఆందోళన నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం మే ఒకటో తేదీన ఈ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది.