జాతీయ వార్తలు

గంగానదిని ఈదేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, ఆగస్టు 29: గంగానదిలో 550 కి.మీ. దూరాన్ని పదిరోజుల్లో ఈదేస్తానంటోంది 11 ఏళ్ల బాలిక. ‘క్లీన్ గంగ’ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, దాంతోపాటే వచ్చే ఒలింపిక్స్‌లో పాల్గొనాలి ఈ బాలిక ఉవ్విళ్లూరుతోంది. 9వ తరగతి చదువుతున్న సిద్ధార్థ శుక్ల కాన్పూర్‌లోని మస్సాక్రే ఘాట్ నుంచి వారణాసి (550 కి.మీ.)కి 10 రోజుల్లో ఈదేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 150 కి.మీ. దూరం పూర్తిచేసిందని ఆమె తండ్రి, సిద్ధార్థకు కోచ్ అయిన లలిత్ శుక్లా విలేఖరులకు తెలిపారు. 2005లో జన్మించిన సిద్ధార్థకు రెండేళ్ల నుంచే నీటిలో ఈదటం నేర్పించినట్లు, 2014లో ఆమె 9వ ఏట కాన్పూర్ నుంచి అలహాబాద్‌కు గంగానదిలో ఈదినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం 550 కి.మీ టార్గెట్‌ను నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఆదివారం సాయంత్రం మస్సాక్రే ఘాట్ నుంచి మొదలు పెట్టిందని తెలిపారు. రోజుకు ఏడు గంటలపాటు ఏకధాటిగా ఈదుతుందని వివరించారు. సిద్ధార్థ ఈదుతున్నప్పుడు ఆమె వెంట ఎనిమిది మంది డ్రైవర్ల బృందంతోపాటు ఇద్దరు షూటర్లు, డాక్టర్లు ఉంటారు. ఆమెకు రక్షణ కల్పించే చర్యల్లో భాగంగానే ఇంతమందితో ఒక స్టీమర్‌లో అనుసరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఈవెంట్‌లో ప్రస్తుతం ఎవరినుంచీ ఎటువంటి ఆర్థిక సహాయం ఆశించడం లేదని, అయితే ఒలింపిక్స్‌లో పాల్గొనాలని సిద్ధార్థ కోరిక అని అది తీరేందుకు యుపి ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి తగిన విధంగా సహాయం చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని వీడియో రికార్డు చేసి ప్రధానికి, యుపి సిఎంకు పంపుతామని లలిత్ శుక్లా తెలిపారు.