జాతీయ వార్తలు

ఇక ‘అమ్మ’జిమ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 29: తమిళనాట ‘అమ్మ’ పేరిట పలు జనాకర్షక పథకాలు ప్రారంభించిన అన్నాడిఎంకె ప్రభుత్వం మరో మందడుగు వేసింది. అమ్మ జిమ్‌లు, అమ్మ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నట్టు తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి జయలలిత సోమవారం ప్రకటించారు. గ్రామీణ ప్రాంత యువతలో శారీరక, మానసిక పరిస్థితిని పెంపొందించడానికి వీటిని ఏర్పాటు చేయతలపెట్టామని ఆమె అన్నారు. 50కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో అమ్మ జిమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఒక్కో జిమ్‌కు పది లక్షల వ్యయం అవుతుందని ఆమె పేర్కొన్నారు. అలాగే గ్రామ పంచాయతీల్లో 500 అమ్మ పార్కులు పెడుతున్నారు. పిల్లలు ఆడుకోడానికి పరికరాలు, హాయిగా గడపడానికి అనువైన సదుపాయాలు పార్కుల్లో ఉంటాయని జయ చెప్పారు. టాయిలెట్లు, సిమెంట్ బెంచ్‌లు, వాకింగ్ చేయడానికి అనువైన సౌకర్యాలు సమకూర్చుతారు. వంద కోట్ల రూపాయలతో వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివిధ రోగాలతో జిల్లా ఆసుపత్రుల్లో ఇన్‌పేషెంట్లుగా చికిత్సపొందుతున్న వారి తరఫున వచ్చే బంధువుల కోసం త్కాలిక ఆవాస కేంద్రాలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. చెన్నైతోపాటు జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. 11.62 కోట్ల రూపాయలు వీటి కోసం వెచ్చిస్తామని జయ పేర్కొన్నారు. మున్సిపాల్టీల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ఎల్‌ఇడి బల్బులు ఏర్పాటు చేయనున్నట్టు ఆమె చెప్పారు. తొలి విడతగా పది కార్పొరేషన్లు, 37 మున్సిపాల్టీల్లో ఫ్లోరోసెంట్ బల్బులను మార్చి ఎల్‌ఇడిలను అమర్చుతారని ఆమె చెప్పారు.