జాతీయ వార్తలు

మహాకూటమి యత్నాలు ఫలించవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 20: కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ మరోసారి అధికారంలోకి రాకుండా మహాకూటమితో ఏర్పాటైన పార్టీల ప్రయత్నాలు ఫలించవని శివసేన వ్యాఖ్యానించింది. చిన్నచిన్న పార్టీలను కలుపుకుని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని దేశం భరించే స్థితిలో లేదని ఎద్దేవా చేసింది.
కొన్ని పార్టీల మద్దతుతో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పాకులాడుతున్న నాయకుల ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇవ్వవని శివసేన పత్రిక ‘సామ్నా’లో రాసిన ఎడిటోరియల్‌లో పేర్కొంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేశంలోని పలు పార్టీలతో మహాకూటమిగా ఏర్పాటై ఈనెల 23న ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో అధికారంలోకి రావాలని చేస్తున్న ప్రయత్నం వృథా ప్రయాసే అవుతుందని శివసేన వ్యాఖ్యానించింది. మహాగత్‌బంధన్ పేరుతో ఏర్పాటైన వివిధ పార్టీల కూటమి అధికారంలోకి వస్తే ఐదుగురు ప్రధానమంత్రులు అయ్యేందుకు ఆశలు పెట్టుకున్నారని శివసేన వ్యాఖ్యానించింది.
‘చిన్నచిన్న పార్టీలతో కలసి కూటమిగా ఏర్పడి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే దానిని దేశం భరించే స్థితిలో లేదు’ అని శివసేన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత కొద్దిరోజులుగా దేశంలోని వివిధ ప్రతిపక్ష నాయకులతో సమావేశమవుతూ కేంద్రంలో బీజేపీయేతర మహాకూటమి ఏర్పాటుకు చురుకుగా పావులు కదుపుతున్న విషయాన్ని ఈ సందర్భంగా శివసేన ప్రస్తావించింది. ‘కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ప్రతిపక్షాలు గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందుకు మహాకూటమిగా ముందుకెళ్తూ వివిధ పార్టీల మద్దతును అభ్యర్థిస్తున్నారు’ అని పేర్కొంది. లోక్‌సభలో మొత్తం 543 సీట్లు ఉండగా, ఈనెల 19తో ఏడు విడతలుగా పోలింగ్ ముగియగా, కౌంటింగ్ ఈనెల 23న జరుగుతుంది.
ఇదిలావుండగా, ఆదివారం ఆఖరివిడత పోలింగ్ పూర్తయిన తర్వాత వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే మళ్లీ కేంద్రంలో అధికారం చేపట్టబోతోందని స్పష్టం చేశాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 300కు పైగా సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించిన నేపథ్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు 272 సీట్లు ఉంటే సరిపోతుంది