జాతీయ వార్తలు

అది పాక్ పనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: ఈ ఏడాది జనవరిలో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని అమెరికా కూడా ధ్రువీకరించింది. జనవరి 2న పఠాన్ కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు జైష్ ఎ మహమ్మద్ సంస్థకు చెందినవారేనని జాతీయ పరిశోధనా ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సంబంధించి జైష్ అధినేత మోస్ట్ వాంటెడ్ వౌలానా మసూద్ అజర్‌పై చార్జిషీట్ దాఖలు చేయటానికి కూడా సన్నద్ధమైంది. ఇదే సమయంలో ఉగ్రదాడిలో పాక్ పాత్రను ధ్రువీకరిస్తూ అందుకు సంబంధించిన ఆధారాలను అమెరికా ఎన్‌ఐఏకు అందించింది. దాడి వెనుక కీలక భూమిక పోషించిన జైష్ ఎ మహమ్మద్ ఉగ్రవాదుల ఫేస్‌బుక్ ఖాతాల వివరాలు.. సంస్థ ఆర్థిక లావాదేవీలు పర్యవేక్షిస్తున్న అల్ రహమత్ ట్రస్ట్‌కు చెందిన వెబ్‌సైట్ ఐపి చిరునామాను కూడా ఎన్‌ఐఏకు అమెరికా అందించింది. జైష్ ఉగ్రవాది కాసిఫ్ జాన్‌కు చెందిన ఫేస్‌బుక్ గ్రూప్ వివరాలు కూడా ఎన్‌ఐఏకు తెలిసాయి. ఈ గ్రూపులో పఠాన్‌కోట్ దాడిలో చనిపోయిన నలుగురు ఉగ్రవాదులు అబ్దుల్‌ఖయ్యూమ్, నాసిర్ హుసేన్, హఫీజ్ అబుబకర్, ఉమర్ ఫరూక్‌ల ఫోటోలు కూడా అందులో లభించాయి. పఠాన్‌కోట్‌పై దాడి జరిగిన సమయంలో అల్హ్రమత్ ట్రస్ట్ తన వెబ్‌పేజిని రంగొనూర్.కామ్, అల్‌ఖలామానలైన్.కామ్‌ల ద్వారా అప్‌లోడ్ చేసింది. తారిఖ్ సిద్ధికి అనే వ్యక్తి ఈ రెండు వెబ్‌సైట్‌లకు అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నాడు. ఈ రెండు వెబ్‌సైట్లు వాటి ఐపి అడ్రస్‌లు పాకిస్తాన్‌కు చెందినవేనని అమెరికా ధ్రువీకరించిందని దర్యాప్తు అధికారి తెలిపారు.