జాతీయ వార్తలు

నిక్కర్లు కాదు.. ఇక ప్యాంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, ఆగస్టు 29: దశాబ్దాలుగా తమ సిద్ధాంతాన్ని ప్రతిబింబించే విధంగా ఖాకీ నిక్కర్లతోనే దర్శనం ఇచ్చిన ఆర్‌ఎస్‌ఎస్, ఈ సంస్కృతికి స్వస్తి పలికింది. మారుతున్న కాలానికి అద్దం పడుతూ యూనిఫాంలోనూ మార్పులు తీసుకువచ్చింది. సోమవారం నుంచి ఈ కొత్త దుస్తుల విక్రయం ఇక్కడి ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం నుంచే సోమవారం మొదలైంది. మరో మూడేళ్లలో జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆర్‌ఎస్‌ఎస్ ఈ మార్పు చేసినట్లు చెబుతున్నారు. ఇకనుంచి నిక్కర్ల స్థానే పూర్తి స్థాయి ప్యాంట్లతోనే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు దర్శనం ఇస్తారు. అయితే నిక్కర్లను ప్యాంట్లుగా మార్చినంత మాత్రాన ఆర్‌ఎస్‌ఎస్ అజెండా కూడా మారిందని భావించకూడదని సంఘ్ సానుభూతిపరులు చెబుతున్నారు. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపినే మళ్లీ నెగ్గేలా చేయాలన్న లక్ష్యంతో ఆర్‌ఎస్‌ఎస్ ఈ ప్రయత్నం చేసినట్లుగా చెబుతున్నారు. నిక్కర్ల స్థానే ప్యాంట్లను ధరించడం వల్ల ఆర్‌ఎస్‌ఎస్ మరింతగా యువతకు చేరువయ్యే అవకాశం ఉంటుందని విశే్లషిస్తున్నారు.