జాతీయ వార్తలు

ఢిల్లీకి రాని దేవెగౌడ, స్టాలిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఈవీఎంలు, వీవీప్యాట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే కార్యక్రమానికి కర్నాటక ముఖ్యమంత్రి కుమార్‌స్వామి, జనతాదళ్ (ఎస్) అధినాయకుడు, మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ గైర్‌హాజరు కావటం ప్రతిపక్షాలను ఆందోళనలో పడవేసింది. పదిహేడవ లోక్‌సభ ఎన్నికల్లో హంగ్ పార్లమెంటు ఏర్పడే పక్షంలో అన్ని ప్రతిపక్షాలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యుద్ధప్రాతిపదికపై పని చేస్తున్న తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం హుటాహుటిన ఢిల్లీ నుండి బెంగళూరుకు వెళ్లారు. కర్నాటక కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసమ్మతి కార్యక్రమాలు ముఖ్యంగా తన ప్రభుత్వాన్ని పతనం చేసేందుకు వేస్తున్న ఎత్తుగడల పట్ల ఆగ్రహంతో ఉన్నందుకే కుమారస్వామి, దేవెగౌడ ఢిల్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుల సమావేశానికి హాజరు కాలేదని అంటున్నారు. కుమారస్వామి, దేవెగౌడ లాంటి నాయకులు ప్రతిపక్షాల సమైక్యతా ప్రయత్నాలకు దూరంగా ఉంటే మొదటికే మోసం వస్తుందన్న ఆందోళనతోనే చంద్రబాబు నాయుడు హుటాహుటిన బెంగళూరు వెళ్లి వారిని సముదాయించారని అంటున్నారు. ఇదిలాఉంటే ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్‌డీఏకు భారీ మెజారిటీ లభిస్తున్నట్లు సంకేతాలు రావటం, నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టటం ఖాయమనే భావన కలిగినందుకే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఢిల్లీలో ప్రతిపక్షాలు నిర్వహించిన సమావేశానికి దూరంగా ఉండిపోయారని అంటున్నారు. ప్రతిపక్ష కూటమికి డీఎంకే దూరమవుతోందనే ప్రచారం జరగకుండా చూసేందుకే ఆయన రాజ్యసభ సభ్యురాలు కనిమోళిని మంగళవారంనాటి ఢిల్లీ సమావేశానికి పంపించారని అంటున్నారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత భవిష్యత్ కార్యచరణ పథకాన్ని తయారు చేసుకోవచ్చునని స్టాలిన్ ఆలోచిస్తున్నట్లు డీఎంకే వర్గాలు చెబుతున్నాయి.