జాతీయ వార్తలు

రాజ్యాంగ వ్యవస్థలను పరిరక్షించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మే 21: దేశ రాజ్యాంగ వ్యవస్థలను పరిరక్షించుకోవాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఒకవేళ విభేదాలు ఉంటే అంతర్గత ప్రక్రియల ద్వారానైనా వాటిని పరిష్కరించుకోవాలని ఉద్ఘాటించారు. కేవలం వందేమాతరం, జై హింద్ అని నినదించినంత మాత్రాన దేశ భక్తి ఉట్టిపడినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. యూనివర్సిటీ, న్యాయ వ్యవస్థ, సీవీసీ, సీఏజీ, ఎన్నికల కమిషన్, పార్లమెంటు, రాష్ట్ర చట్ట సభలు ఇలా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలన్నింటినీ బలోపేతం చేయాలే తప్ప ఎట్టిపరిస్థితుల్లోనూ నీరుగార్చడానికి వీల్లేదని వెంకయ్య నాయుడు అన్నారు. మంగళవారంనాడిక్కడ జరిగిన ఓ స్నాతకోత్సవ సభలో మాట్లాడిన ఆయన ‘ఎక్కడైనా తప్పు ఉంటే దానిని సరిదిద్దుకునేందుకు అంతర్గత మార్గాలుంటాయి, తగిన వేదికలపై చర్చించి వాటిని పరిష్కరించుకోవాలే తప్ప వ్యవస్థలను నీరుగార్చకూడదు..’ అని ఉద్ఘాటించారు. జాతీయవాదంపై చెలరేగుతున్న వివాదాలను పరోక్షంగా ప్రస్తావించిన వెంకయ్య నాయుడు రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణ అవసరాన్ని ఈ కోణంలోనే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. దేశ భక్తి అంటే భరత మాత విగ్రహం ముందు తల వంచి నమస్కరించడమే కాదని పేర్కొన్న ఆయన ‘కన్యాకుమారిలో ఏదైనా జరిగితే కాశ్మీర్ ప్రతిస్పందించాలి, కేరళలో ఏదైనా జరిగితే మరో రాష్ట్రం స్పందించాలి, జాతీయ వాదం, దేశ భక్తి అంటే ఇదే’ అని ఆయన అన్నారు. కులం, వర్గం, ప్రాంతం, మతం అనే విభేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పర్సపరం గౌరవించుకోవడం బలపరచుకోవడమే జాతీయవాద స్ఫూర్తికి నిదర్శనం అవుతుందన్నారు. ప్రతి పౌరున్ని సంరక్షించడమే నిజమైన దేశ భక్తి అని దీనిని మరో విధంగా అన్వయించడానికి వీల్లేదని ఆయన తెలిపారు. విశ్వ విద్యాలయాల ప్రాంగణాలు అన్య అంశాలతో విషతుల్యం కావడానికి వీల్లేదన్నారు.
కేవలం కొన్ని విశ్వ విద్యాలయాలను మినహాయిస్తే దేశంలోని 900 యూనివర్సిటీలు ఎలాంటి అలజడులు లేకుండా పని చేయడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నదని వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా తెలిపారు. ‘మీకు ఒక రకమైన ఆహార పదార్థం ఇష్టమైతే దానిని ఆస్వాదించండి, కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ప్రచారం చేయవద్దు..’ అని ఆయన స్పష్టం చేశారు.