జాతీయ వార్తలు

కాశ్మీర్‌కు అఖిలపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అధ్యయనం చేసేందుకు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిల పక్షం సెప్టెంబర్ నాలుగో తేదీ రాష్ట్ర రాజధాని శ్రీనగర్‌కు వెళుతోంది. అఖిల పక్షం అవసరమైతే రెండు మూడు రోజులు శ్రీనగర్‌లోనే ఉండి వీలున్నంత ఎక్కువ మందితో చర్చలు జరుపుతుందని అంటున్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వని భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో మరణించినప్పటి నుండి కాశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటం తెలిసిందే. రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం సాయంత్రం బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి జితేందర్ సింగ్‌తో సమావేశమై కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు, కాశ్మీర్‌కు అఖిల పక్షాన్ని తీసుకెళ్లటం తదితర అంశాలపై చర్చలు జరిపారు. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గత వారం ఢిల్లీకి వచ్చి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి కాశ్మీర్ లోయలో నెలకొన్న పరిస్థితులపై చర్చలు జరిపినప్పుడు అఖిల పక్షాన్ని రాష్ట్రానికి తీసుకెళ్లటం గురించి చర్చించారు. పాకిస్తాన్ సహాయంతో రెచ్చిపోతున్న వేర్పాటు వాదులు కాశ్మీర్‌లోని అన్ని ప్రాంతాల్లో భద్రతా దళాలతో తలపడటంతో 48 ఎనిమిది రోజుల నుండి కొనసాగుతున్న కర్ఫ్యూను సోమవారం కొంత సడలించారు. వేర్పాటువాదులు భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వేందుకు చిన్న పిల్లలను అడ్డం పెట్టుకోవటం, భద్రతా దళాలు పెల్లెట్ బుల్లెట్లు పేల్చటంతో చిన్న పిల్లలు తీవ్రంగా గాయపడటం తెలిసిందే. భద్రతా దళాల కాల్పుల్లో చిన్న పిల్లలు కళ్లు, కాళ్లు కోల్పోవటం అంతర్జాతీయ దృష్టిని ఆకర్శించింది. అయితే పాకిస్తాన్ తెర వెనక నుండి కాశ్మీర్ యువతను రెచ్చగొట్టటం గురించి అంతర్జాతీయ ప్రజానీకానికి తెలియటం లేదు. వేర్పాటు వాదులు చిన్న పిల్లలను షీల్డ్‌గా దుర్వినియోగం చేయడాన్ని ప్రపంచం దృష్టికి తీసుకురావటంతోపాటు రాష్ట్ర ప్రజలకు విశ్వాసం కలిగించాలనే ఆలోచనతోనే ఎన్‌డిఏ ప్రభుత్వం అఖిల పక్షాన్ని కాశ్మీర్ లోయకు తీసుకుపోతోందని అంటున్నారు. కాశ్మీర్‌లో భద్రతా దళాలు ఎదుర్కొంటున్న సమస్యలు, పడుతున్న కష్టాలను అఖిల పక్షం దృష్టికి తీసుకురావాలన్నది కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన.
పిఓకె బాధితులకు నష్టపరిహారం
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) నుండి వలస వచ్చిన ప్రతి కుటుంబానికి ఐదున్నర లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసేందుకు ఎన్‌డిఏ ప్రభుత్వం సిద్ధమవుతోంది. పిఓకె నుండి దాదాపు 36,348 కుటుంబాలు కాశ్మీర్‌కు వలస వచ్చాయి. వీరిని ఆదుకునేందుకు కేంద్రం రూ. 2వేల కోట్ల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ దురాగతాలను బహిర్గతం చేసే ప్రయత్నాల్లో భాగంగానే మోదీ ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయం చేయాలనుకుంటోందని చెబుతున్నారు.

చిత్రం.. శ్రీనగర్‌లో సోమవారం భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులు