జాతీయ వార్తలు

బెంగాలీలో బంగ్లా ఆంగ్లంలో బెంగాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఆగస్టు 29: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరు మార్పును అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. ఇంగ్లీష్‌లో బెంగాల్‌గా, బెంగాలీలో బంగ్లాగా మారుస్తూ తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. పేరు మార్పును ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి, లెఫ్ట్‌ఫ్రంట్‌ను వ్యతిరేకించాయి. పేరు మార్పు తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి పార్థ చటర్జీ 169వ నిబంధన కింద సభలో ప్రవేశపెట్టారు. బెంగాలీలో బంగ్లా, ఆంగ్లంలో బెంగాల్ పేరు మారుతుందని ఆయనీ సందర్భంగా చెప్పారు. రాష్ట్రం పేరు మార్పును ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పూర్తిగా సమర్థించారు. చారిత్రక, సాంస్కృతిక చరిత్రను పరిగణలోకి తీసుకుని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరు మార్చుకు శ్రీకారం చుట్టామని ఆమె ప్రకటించారు. పేరు మార్పువల్ల ఎవరికి ఏ ఇబ్బంది కలుగుతుందని ఆమె ప్రశ్నించారు. దీంట్లో కన్‌ఫ్యూజ్ అయ్యేది కూడా లేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. రాష్ట్రం పేరు మార్పును వ్యతిరేకించే పార్టీలు అడ్రసు లేకుండా పోతాయని ఆమె హెచ్చరించారు. పేరు మార్పుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందని, ఇదే విషయాన్ని కేంద్ర దృష్టికి తీసుకెళ్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.