జాతీయ వార్తలు

నేడు భారత్-అమెరికా వ్యూహాత్మక భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: రెండో వ్యూహాత్మక చర్చల్లో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సోమవారం భారత పర్యటనకు వచ్చారు. మంగళవారం జరిగే చర్చల్లో ఉగ్రవాదం సహా ఇరు దేశాలకు సంబంధించిన అనేక ద్వైపాక్షిక అంశాలు ప్రస్తావనకు వస్తాయి. ఈ చర్చల్లో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్, అమెరికా వాణిజ్య మంత్రి పెన్నీ ప్రిట్జ్‌కెర్‌లు పాల్గొంటారు. ఉభయ దేశాల మధ్య వివిధ రంగాల్లో కొనసాగుతున్న మైత్రి బంధం గురించి ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.