జాతీయ వార్తలు

నా జీవితం దేశానికే అంకితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: ‘నా జీవితంలో ప్రతిక్షణం, అలాగే నా శరీరంలోని ప్రతి అణువు దేశానికే అంకితం’ అంటూ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తనకు ఇచ్చిన అపూర్వ మెజారిటీకి స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగభరితంగా అన్న మాటలివి. దేశవ్యాప్తంగా అనూహ్యరీతిలో బీజేపీకి ప్రజలు విజయాన్ని కట్టబెట్టిన నేపథ్యంలో గురువారం ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన మోదీకి అడుగడుగునా హర్షధ్వానాలు లభించాయి. దేశంలో రెండే కులాలు ఉన్నాయని, ఒకటి పేదల కులం, మరొకటి పేదరికాన్ని అంతం చేసేందుకు శ్రమించే వారి కులమని మోదీ అన్నారు. నవభారత నిర్మాణ దిశగా మరింత ముందుకు సాగేందుకు ప్రజలు ఈ అపూర్వ విజయాన్ని కట్టబెట్టారని మోదీ అన్నారు. ‘ప్రజలు మోదీ, మోదీ
అని నినదిస్తున్నారు, కానీ ఇది మోదీ విజయం కాదు, వ్యవస్థలో నిజాయితీ కోసం పాటుపడుతున్న వారి విజయం ఇది, ప్రజల ఆశలు, ఆకాంక్షలు సాధించిన విజయం ఇది..’ అని మోదీ అన్నారు. కలిసి పని చేద్దామంటూ రాజకీయ ప్రత్యర్థులకు సైతం పిలుపునిచ్చిన మోదీ ఎన్నికల్లో సాగిన పరస్పర విమర్శలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్నారు. గతాన్ని మరచిపోయి కలసి కట్టుగా అందరూ ముందుకు సాగాల్సిన సమయం ఇది అంటూ ఆయన ఉద్ఘాటించారు. దేశ ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరితో కలిసి వెళ్ళాలని అన్నారు. ‘ఈ సన్యాసి సంచిని మీ ఆశలతో, కలలతో ఆశయాలతో ఆకాంక్షాలతో నింపేశారు..’ అని మోదీ అన్నప్పుడు హర్షధ్వానాలు మిన్నంటాయి. తమకు లభించిన విజయాన్ని దేశానికి అన్నం పెట్టే రైతు సాధించిన విజయంగా ప్రస్తుతం పక్కా ఇళ్ళలో నివసిస్తున్న వారి విజయంగా, నియమాలకు కట్టుబడి జీవించే మధ్యతరగతి వాసులు సాధించిన విజయంగా మోదీ అభివర్ణించారు. గత ఐదేళ్ళుగా ప్రజలు చెల్లిస్తున్న పన్నును దేశ నిర్మాణం కోసమే వెచ్చించామన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని మోదీ తెలిపారు. ‘విధుల నిర్వహణలో భాగంగా నేను పొరపాటున తప్పు చేయవచ్చునేమో కానీ దాని వెనకాల ఎలాంటి దురుద్ధేశ్యం ఉండదు..’ అని ఆయన తెలిపారు. తన జీవితంలోని ప్రతి క్షణం, తన శరీరంలోని ప్రతి అణువు ఇక దేశానికే అంకితమని పేర్కొన్న మోదీ ‘మీరు నా పని తీరును ఎప్పుడు అంచనా వేసినా, వీటినే ప్రామాణికంగా తీసుకోండి..’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకవేళ తాను ఏ మాత్రం జనాకాంక్షాలను తీర్చలేకపోయినా, తనను శిక్షించాలని అన్నారు. తన స్వార్థం కోసం ఏ పనీ చేయనని ఉద్ఘాటించిన మోదీ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు త్రికరణ శుద్ధిగా కృషి చేస్తానన్నారు. విలువలు, ప్రజాస్వామ్య స్పూర్తి, రాజ్యాంగపదంలోని తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ప్రతి ఒక్కరిని తనతో ముందుకు తీసుకెళతుందన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు అన్నీ కూడా అవినీతి అంశాల ప్రాతిపదికనే సాగాయని, తాజా ఎన్నికల్లో ఏ పార్టీ కూడా తమపై అవినీతి ఆరోపణ చేయలేకపోయిందన్నారు. ఇలా ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి అని తెలిపారు. కులాల పేరుతో రాజకీయ పబ్బం గడుపుకుంటున్న పార్టీలకు చెంపపెట్టులాంటి తీర్పును ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చారన్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో పోటీ చేసింది పార్టీలు కాదు ప్రజలేనన్న తన మాట ఈ తీర్పు ద్వారా రుజువైందన్నారు. 1984లో రెండు సీట్లు వచ్చినప్పుడు తాము నిరుత్సాహపడలేదని, ఇప్పుడు అసాధారణ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ సిద్ధాంతాలు, విలువలు, మానవీయతను విడనాడేది లేదని మోదీ తెలిపారు.