జాతీయ వార్తలు

కుదేలైన కుబేరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే టాప్ టెన్ సంపన్నుల జాబితాలో ఉన్నవారిలో జయాపజయాలను చెరిసగం పంచుకోవడం విశేషం. ముఖ్యంగా పోటీ చేసిన పది మంది సంపన్నుల్లో అంత్యంత సంపన్నుడైన వ్యక్తికి డిపాజిట్ కూడా దక్కకపోవడం శోచనీయం. మొత్తంగా చూస్తే పది మంది సంపన్నుల్లో ఐదుగురిని విజయం వరించగా.. మరో ఐదుగురు పరాజయాన్ని చవి చూశారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌ల మేరకు... బిహార్‌కు చెందిన రమేష్ కుమార్ శర్మ సంపన్నుల జాబితాలో ప్రథమ స్థానంలో ఉండగా తెలంగాణకు చెందిన కొండా విశే్వశ్వర్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. మొత్తంగా చూస్తే పోటీ చేసిన సంపన్నుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ముగ్గురు, బిహార్, మధ్యప్రదేశ్‌ల నుంచి చెరో ఇద్దరు, తమిళనాడు, కర్నాటక, తెలంగాణల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. సంపన్నుల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న రమేష్ కుమార్ శర్మ తన ఆస్తులను 1107 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 1556 ఓట్లు మాత్రమే దక్కించుకొని డిపాజిట్ కోల్పోవడం విశేషం.
ఏడో స్థానంలో ఉన్న ఇదే రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి ఉదయ్‌సింగ్ పూర్ణియా నుంచి పోటీ చేసి రెండు లక్షల 63వేల 461 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొండా విశే్వశ్వర్ రెడ్డి చేవెళ్ల స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తెరాస అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. సంపన్నుల జాబితాలో ఉన్న విశే్వశ్వర్ రెడ్డి 895 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. మరో కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింథియా యూపీ (పశ్చిమ)లోని గుణ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కృష్ణపాల్ సింగ్ చేతిలో ఓడిపోయారు. ఈ సంపన్నుల జాబితాలో 374 కోట్ల ఆస్తులతో ఐదో స్థానంలో ఉన్నారు. ఏపీలోని విజయవాడ నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన పారిశ్రామికవేత్త పొట్లూరి వీర ప్రసాద్ ఎనిమిది వేల 726 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. సంపన్నుల జాబితాలో 347 కోట్ల ఆస్తులతో ఆరో స్థానంలో ఉన్నారు. ఇక గెలిచిన సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నకుల్‌నాథ్ ఆస్తులు 660 కోట్లు కాగా ఈయన మధ్యప్రదేశ్‌లోని చింద్వారా నుంచి 37 వేల 536 ఓట్ల తేడాతో గెలిచారు. 417 కోట్ల ఆస్తులతో నాలుగో స్థానంలో ఉన్న హెచ్ వసంత్‌కుమార్, బెంగళూరు రూరల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన డీకే సురేష్ 338 కోట్లతో గెలిచారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కనుమూరు రఘురామకృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా 32వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఈయన ఆస్తులు 325 కోట్లు. ఇక గుంటూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన గల్లా జయదేవ్ 305 కోట్ల ఆస్తులతో పదో స్థానంలో నిలిచారు.