జాతీయ వార్తలు

ఐదు హైకోర్టులకు ఫుల్‌టైమ్ చీఫ్ జస్టిస్‌లు లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశవాప్తంగా ఐదు హైకోర్టుల్లో రెగ్యులర్ ప్రధాన న్యాయమూర్తులు లేరు. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల ఖాళీల భర్తీకి నోచుకోకపోవడంతో కేసులు లక్షల్లో పేరుకుపోతున్నాయి. మొత్తం 478 జడ్జీ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
దీనికి తోడు ఆంధ్రప్రదేశ్/తెలంగాణ, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్,సిక్కిం,త్రిపుర హైకోర్టులకు రెగ్యులర్ చీఫ్ జస్టిస్‌లు లేరు. ఆగస్టు 1 నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇన్‌చార్జిలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. దేశంలోని 24 హైకోర్టుల్లో ఉండాల్సిన న్యాయమూర్తులు 1079. అయితే 601 మందితోనే నడుస్తున్నాయి. 478 మంది జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోపక్క హైకోర్టుల్లో పెండింగ్ కేసులయితే 39 లక్షల వరకూ ఉన్నాయి. న్యాయమూర్తుల సంఖ్యను పెంచడంతోపాటు ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.