జాతీయ వార్తలు

పట్టువిడుపులతోనే ఉమ్మడి పంపకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: రాష్ట్ర విభజన చట్టం 9, 10 షెడ్యూలులోని ఉమ్మడి సంస్థల పంపకాల విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు పరస్పర చర్చల ద్వారానే రెండు షెడ్యూళ్లలోని సంస్థలను విభజించుకోవాలని కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి దిలీప్‌కుమార్ హితవు చెప్పి తప్పించుకున్నారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని ఉమ్మడి సంస్థల విభజనపై చర్చించి సమస్యలను పరిష్కరించేందుకు దిలీప్‌కుమార్ శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ తరఫున ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ శశాంక్ గోయల్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ నుండి విభజన అంశాల బాధ్యత నిర్వహిస్తున్న సీనియర్ అధికారి ప్రేమ్‌చంద్రారెడ్డి హాజరయ్యారు. ఏపీ విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని ఉమ్మడి సంస్థల విభజనపై సమావేశంలో సమీక్షించారు. ఇంతవరకు పరిష్కారమైన అంశాలు, ఇంకా పరిష్కరించాల్సిన అంశాలను సమీక్షించారు. రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తే తప్ప సమస్యలు త్వరగా పరిష్కారం కావనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తమవంతు కృషి చేస్తుందని దిలీప్‌కుమార్ చెప్పారు. కేంద్రం ఎంత ప్రయత్నించినా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తే ఫలితాలు కనిపించవని స్పష్టం చేసినట్టు తెలిసింది. రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన అంశాలను పరిష్కరించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు చిత్తశుద్ధితో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని కేంద్రం సూచించిందని అంటున్నారు. రెండు రాష్ట్రాలు పరస్పర చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవటమే ఉత్తమ మార్గమని కేంద్రం సూచించినట్టు సమాచారం.