జాతీయ వార్తలు

దూసుకొస్తున్న ‘వాయు’ తుఫాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, జూన్ 11: ‘వాయు’ తుపానును ఎదుర్కోవడానికి గుజరాత్ పాలనాయంత్రాంగం అప్రమత్తమయింది. గుజరాత్‌లోని వెరవల్ సమీపంలో గురువారం ‘వాయు’ తుపాను తీరం దాటే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని మంగళవారం తెలిపారు. వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం, తుపాను ‘వాయు’ వెరవల్ తీరానికి దక్షిణాన సుమారు 650 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమయి ఉంది. రానున్న 12 గంటల్లో అది మరింత బలపడి తీవ్రమయిన తుపానుగా మారే అవకాశం ఉంది. జూన్ 13న అది గుజరాత్‌లో తీరాన్ని దాటుతుంది. కచ్ నుంచి దక్షిణ గుజరాత్ వరకు గల రాష్ట్రంలోని మొత్తం సముద్ర తీర ప్రాంతాన్ని అప్రమత్తం చేసినట్టు రూపాని గాంధీనగర్‌లో విలేఖరులకు తెలిపారు. గుజరాత్‌లోని సంబంధిత అధికారులు ఒడిశా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఇటీవల తుపాను ‘్ఫని’ ఒడిశాను ఢీకొన్నప్పుడు వారు అనుసరించిన ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే నైపుణ్యాలను తెలుసుకొని, గుజరాత్‌లోనూ వాటిని అమలు చేస్తారని ఆయన వివరించారు. సంబంధిత ఉద్యోగుల సెలవులను రద్దు చేశామని, వెంటనే విధుల్లో చేరాలని వారిని ఆదేశించామని ఆయన తెలిపారు. రేపు క్యాబినెట్ సమావేశం ముగిసిన తరువాత మంత్రులందరూ వివిధ జిల్లాలకు వెళ్లి సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని ఆయన చప్పారు.
ఏర్పాట్లను సమీక్షించిన అమిత్ షా
న్యూఢిల్లీ: ‘వాయు’ తుపానును ఎదుర్కోవడానికి చేసిన ఏర్పాట్లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం ఇక్కడ సమీక్షించారు. ప్రజలను రక్షించడానికి వీలయినన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) ఇప్పటికే 26 టీమ్‌లను గుజరాత్‌లో ఉంచింది. ఒక్కో టీమ్‌లో సుమారు 45 మంది సిబ్బంది ఉన్నారు. సహాయక సిబ్బందికి పడవలు, ట్రీకటర్లు, టెలికం పరికరాలు అందజేశారు. గుజరాత్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎన్‌డీఆర్‌ఎఫ్ మరో పది టీమ్‌లను గుజరాత్‌కు పంపిస్తోంది. సమీక్ష అనంతరం అమిత్ షా.. ప్రజలను సురక్షితంగా తరలించేందుకు వీలయిన ప్రతి చర్య తీసుకోవాలని సీనియర్ అధికారులను ఆదేశించారు. విద్యుత్తు, టెలికమ్యూనికేషన్స్, హెల్త్, తాగునీరు వంటి అత్యవసర సర్వీసులను సరిగా నిర్వహించాలని, తుపా ను వల్ల ఈ సర్వీసులకు ఏమైనా విఘాతం కలిగితే, వెంటనే పునరుద్ధరించాలని కూడా ఆయన ఆదేశించినట్టు హోమంత్రిత్వ శాఖకు చెంది న ఒక అధికారి తెలిపారు.