జాతీయ వార్తలు

వాతావరణ కాలుష్యం.. తగ్గనున్న జీవన ప్రమాణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: వాతావరణ కాలుష్యం మనిషి జీవన మనుగడను ఘోరంగా దెబ్బతీస్తోంది. మన దేశంలో నానాటికీ పెరుగుతున్న వాతావరణ కాలుష్యం సగటు మనిషిపై తీవ్ర ప్రభావం చూపనుందని తాజాగా జరిపిన పరిశోధనల ద్వారా తెలుస్తోంది. వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దాని మూలంగా సంక్రమించే వివిధ రకాలైన వ్యాధుల కారణంగా మనిషి సగటు జీవితకాలం రెండున్నర సంవత్సరాలు తగ్గుతుందని తాజా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ)కు చెందిన ఎన్విరాన్‌మెంట్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం బహిరంగ ప్రదేశాలు, ఇళ్లలోని వాతావరణ కాలుష్యం వల్ల ప్రాణాన్ని హరించే వ్యాధులకు దారితీయవచ్చునని ఆ నివేదిక పేర్కొంది. భారతదేశంలో పొగతాగే వారికంటే మూడు రెట్లు ఎక్కువగా వాతావరణం కలుషితం వల్ల మరణాలకు ఆస్కారం ఉందని ఆ నివేదిక తెలిపింది. ‘బహిరంగ ప్రదేశాలు, ఇళ్లలోని కాలుష్యం కలగలసి దక్షిణాసియాలో ముఖ్యంగా భారత్‌లో నిర్ణీత కాలం కంటే రెండున్నర సంవత్సరాల ముందే వివిధ రోగాలు సంక్రమించడం ద్వారా మరణాలు సంభవిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ కాలుష్యం కారణంగా సగటు జీవన ప్రమాణం కంటే 20 నెలల వరకు ఆయుఃప్రమాణం తగ్గుతుండగా, భారత్‌లో మాత్రం అందుకు భిన్నంగా రెండున్నరేళ్లు అంటే 30 నెలల కంటే ముందుగానే మనిషి మరణించేందుకు అవకాశం ఉంది.’ అని సీఎస్‌ఈ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వాతావరణం కలుషితం క్రమేణా ఎక్కువ అవుతుండడం వల్ల క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ)లు 49 శాతం పెరిగి మరణాలు సంభవించేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా 33 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్, సుగర్ (డయాబెటిస్), గుండె సంబంధిత జబ్బులు 22 శాతం పెరగడం, 15 శాతం హఠాత్తుగా గుండెనొప్పి వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. అంతేకాకుండా ఊపిరితిత్తులు, మెదడు, కడుపునొప్పి, చర్మవ్యాధులు, ఎముకల వ్యాధులు వంటి అనేకానేక వ్యాధులు రావడం ద్వారా భారత్‌లో మనిషి జీవన ప్రమాణం రెండున్నరేళ్లు తగ్గుతుందని ఆ పరిశోధనలో వెల్లడైంది. ఇదిలావుండగా, సీఎస్‌ఈ తాజా నివేదికపై భారత్‌లో మనిషి ఆయుఃప్రమాణం తగ్గుతుందన్న వార్తలపై వ్యాఖ్యానించేందుకు ప్రభుత్వ అధికారులెవరూ సిద్ధంగా లేరు.