జాతీయ వార్తలు

ప్రతిష్టకు పోవద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న వైద్యుల సమ్మెకు ‘సానుకూల పరిష్కారం’ అనే్వషించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోరారు. సున్నితమైన అంశాన్ని ‘ప్రతిష్ట’గా తీసుకోవద్దనీ.. ఆందోళనకు సానుకూలంగా ముగింపు నివ్వాలని శుక్రవారం మమతకు రాసిన ఓ లేఖలో కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. వైద్యులు సురక్షితంగా పనిచేసే వాతావరణం అక్కడ కల్పించాలని పేర్కొన్నారు. ‘ఆందోళన చెయొచ్చు కానీ అది రోగులకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు’ అని ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ వైద్యులను ఉద్దేశించి కేంద్ర మంత్రి చెప్పారు. కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో మంగళవారం ఓ రోగి మరణించాడని అతని బంధువులు దాడికి దిగడంతో ఇద్దరు వైద్యులకు తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. దాడిలో వైద్యులకు గాయాలైన తరుణంలో తమకు తగినంత భద్రత కల్పించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని డిమాండ్ చేశారు. అయితే, ఇందుకు భిన్నంగా వ్యవహిరిస్తూ వైద్యులకు అల్టిమేటం జారీ చేయడంతో మమత బెనర్జీపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకింది.. అందులో భాగంగానే వీరు సమ్మె బాట పట్టారు. ‘‘డాక్టర్లు ఆందోళనకు దిగిన నేపథ్యంలో సమస్యపై మీరు సున్నితంగా వ్యవహరించి ఉంటే రోగులకు ఎలాంటి ఇబ్బంది కలిగి ఉండేది కాదు.. మీరు ఈ అంశాన్ని ఏమాత్రం ‘ప్రతిష్ట’గా తీసుకోవద్దని’’ మంత్రి హర్షవర్థన్ సీఎం మమతా బెనర్జీని కోరారు. బెంగాల్‌లో వైద్యులపై దాడులను ఖండిస్తూ ఎయిమ్స్‌కు చెందిన రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్‌తో పాటు ఇతర వైద్య సంఘాలు కేంద్ర మంత్రిని కలిసి ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టాలని ఓ ప్రకటనలో కోరారు. ఈమేరకు వర్దన్ వైద్యులతో మాట్లాడుతూ ‘దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా.. వైద్యులపై ఇటువంటి దాడులకు పాల్పడడం హేయమైన చర్యగా భావిస్తున్నా.. దీనిపై ముఖ్యమంత్రి మమతతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని వైద్య సంఘాలకు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
జూడాలకు మద్దతుగా
‘మహా’ వైద్యుల ఒక రోజు సమ్మె
బెంగాల్‌లో జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెకు సంఘీభావం వ్యక్తం చేస్తూ మహారాష్ట్ర లోని నాలుగు వేల 500 మంది వైద్యులు శుక్రవారం ఒక రోజు సమ్మెకు దిగారు. ‘ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్లు శస్తచ్రికిత్సల్లో పాల్గొనలేదు.. ఓపీ విభాగాలకు హాజరు కాలేదు.. దీంతో అత్యవసర సేవలకు ఎలాంటి విఘాతం కలుగలేదు’ అని మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ పేర్కొంది. ‘ఆలిండియా ప్రొటెస్ట్ డే’గా ఈ రోజును పరిగణిస్తున్నామని ఐఎంఏ పేర్కొంది. మంచి వాతావరణంలో వైద్యులు పనిచేసే విధంగా ఉండాలని కోరింది.