జాతీయ వార్తలు

25నుంచి కార్గిల్ సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: ‘కార్గిల్ విజయ్ దివస్’ 20వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఆర్మీ తగిన ప్రణాళిక రచిస్తోంది. జూలై 25 నుంచి 27 వరకు ఢిల్లీ నుంచి జమ్మూ-కాశ్మీర్‌లోని ద్రాస్ వరకు భారీ ఎత్తున నిర్వహించే ‘కార్గిల్ గెలుపు సంబరాలు’ కోసం ఆర్మీ పూర్తి సన్నద్ధతతో ఉందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. ‘కార్గిల్ విజయ్ దివస్’ 20వ వార్షికోత్సవం సంబరాల్లో భాగంగా వచ్చే నెలలో మూడు రోజులపాటు భారీ ఎత్తున నిర్వహించే కార్యక్రమాలను పటిష్టవంతం చేసే ప్రక్రియలో భాగంగా జూలై మొదటివారంలో ఇందుకు తగిన కార్యాచరణ రూపొందించనున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. దేశ రాజధాని ఢిల్లీలో జూలై 14న జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్గిల్ గెలుపు సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్థూపం నుంచి తొలుత ప్రారంభమయ్యే ఈ కార్గిల్ జ్యోతి దేశంలోని 11 పట్టణాలు, నగరాల్లో కొనసాగి, చివరకు జమ్మూ-కాశ్మీర్‌లోని ద్రాస్‌లో కలవడం ద్వారా ముగుస్తుంది. కార్గిల్ జ్యోతిలో పాల్గొనే సభ్యులు ఆయా ప్రాంతాల్లో విద్య, దేశభక్తి, ప్రముఖ వ్యక్తులతో చర్చాగోష్టి, వివిధ విద్యా సంస్థల్లో విద్యార్థులను కలుసుకోవడం వంటి కార్యకలాపాలు చేపడతారని ఆర్మీ శుక్రవారంనాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా క్రీడాజ్యోతి ప్రతినిధులు సాహసయాత్రల్లో పాల్గొన్నవారిని కలుసుకోవడంతోపాటు టోలోలింగ్, టైగర్ హిల్, పీటీ 4875 వంటి ప్రాంతాల్లోని యుద్ధ్భూముల్లో పాల్గొన్నవారితోపాటు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఎన్‌సీసీ కేడెట్ల కోసం ప్రత్యేక జాతీయ సమగ్రతా శిబిరాలు వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆయా కార్యక్రమాలు 12 రోజులపాటు కొనసాగి చివరకు లెహ్ ప్రాంతంతో ముగుస్తాయి. లడఖ్ రీజియన్‌లో పాఠశాలల పిల్లల కోసం డ్రాయింగ్, వ్యాసరచన వంటి పోటీలను నిర్వహిస్తారు. ‘2019 సంవత్సరం కార్గిల్ వార్‌లో చేపట్టిన ఆపరేషన్ విజయ్‌గా పరిగణించి చేపట్టే 20వ కార్గిల్ వార్షికోత్సవ సంబరాలుగా భారీ ఎత్తున దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ‘దేశం ఈ ఏడాది కార్గిల్ యుద్ధాన్ని 20వ వార్షికోత్సవంగా జరుపుకోవడం గర్వం, గౌరవం, స్ఫూర్తిగా నిలుస్తాయి’ అని ఆర్మీ తన ప్రకటనలో పేర్కొంది. సియాచిన్ సెక్టార్‌లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాల్గొన మన దేశ సైనిక పోరాటం, పటిమ, శ్రద్ధ, పట్టుదల వంటి అంశాలు ప్రజల మదిలో ఎల్లప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపింది. అదేవిధంగా కార్గిల్ పోరులో మన వీర సైనికులు చూపిన తెగువ ఇపుడు సైన్యంలో ఉన్న ప్రతిఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొంది. సైనికులు చేసిన త్యాగనిరతిని మెచ్చుకోవడం, మననం చేసుకోవడం వంటి అంశాలు ఇపుడు అందరిలో మరింత గౌరవాన్ని పెంపొందిస్తాయని ఆర్మీ అభిప్రాయపడింది. ‘గుర్తు చేసుకోవడం, సంతోషించడం, పునరుద్ధరించడం’ వంటి అంశాలు ఈ 20వ కార్గిల్ విజయ్ దివస్ ఉత్సవాల సందర్భంగా ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని పేర్కొంది. దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టడం వల్ల ముఖ్యంగా యువతలో దేశభక్తిని పెంపొందించడం, ఎంతోమంది వీర సైనికుల త్యాగాలను పునశ్ఛరణ చేసుకోవడం జరుగుతుందని ఆర్మీ తెలిపింది. కార్గిల్ యుద్ధం జరిగిన నాటికి ఇంకా జన్మించనివారు, పుట్టినా కార్గిల్ యుద్ధం గురించి కొనే్నళ్లపాటు తెలియని యువతలో సైతం యుద్ధం గురించి, మన వీర సైనికులు ఎంతో ధైర్యసాహసాలకు ఒడిగట్టి సాధించిన ప్రగతి గురించి తెలియజెప్పడమే ఈ కార్గిల్ ఉత్సవాల ప్రత్యేకతని ఆర్మీ స్పష్టం చేసింది. లడఖ్ ప్రాంతంలోని ప్రజలకు కార్గిల్ విజయ్ దివస్ ఒక ప్రత్యేక కార్యక్రమంగా నిలుస్తుందని ఆర్మీ తెలిపింది. ఇక్కడ జరిగే కార్గిల్ విజయ్ దివస్ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే పరుగుపందెం ‘ఏక్ దౌడ్ షహీడన్ కే నామ్’లో స్థానిక పౌరులతోపాటు రీజియన్ పరిధిలోని మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆర్మీ విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ ఆటలైన పోలో, విలువిద్య, లడఖ్ ఎన్‌డీఎస్ మెమోరియల్ స్టేడియంలో టీ-20 క్రికెట్ చాంపియన్‌షిప్ నిర్వహించనున్నట్టు ఆర్మీ పేర్కొంది. ఆయా కార్యక్రమాలను భారత ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఐటీబీపీ, స్థానికంగా ఉండే పలు క్లబ్బులు పర్యవేక్షిస్తాయని తెలిపింది.