జాతీయ వార్తలు

కరవుపై నీతి ఆయోగ్ ప్రధాని అధ్యక్షతన నేడు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూన్ 14: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం రాష్టప్రతి భవన్‌లో జరుగనున్న నీతి ఆయోగ్ ఐదో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో దేశంలో నెలకొన్న కరవు పరిస్థితులను ఎదుర్కొనడం, తీసుకోవలసిన సహాయ చర్యలపై దృష్టి సారించనుంది. సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర రక్షణ, ఆర్థిక, హోం, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి , పంచాయతీరాజ్ మంత్రులు ఎక్స్ అఫీసియో సభ్యులుగా
హాజరవుతారు. వీరితోపాటు నీతి ఆయోగ్ సీఈవో ఇతర సీనియర్ అధికారులు రోడ్లు, భవనాలు, చిన్న, మధ్య పరిశ్రమలు, సామాజిక న్యాయం, సాధికారిత, రైల్వే, వాణిజ్యం, పరిశ్రమలు, ప్రణాళికా కార్యక్రమాలు అమలుపై సమీక్షిస్తారు. అలాగే వాణిజ్య వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, జలశక్తి, పశు సంవర్ధం, డైరీ, చేపల పెంపకం శాఖల స్వతంత్ర, సహాయ మంత్రులు, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో హాజరవుతారు. రాష్టప్రతి భవన్‌లో జరిగే సమావేశంలో దేశంలో నెలకొన్న కరవు, తీసుకోవలసిన నివారణ చర్యలతోపాటు వర్షం నీటిని పొదుపు చేయటం, జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి, ఎదుర్కొంటున్న సవాళ్లు, వ్యవసాయ పరివర్తన, నిర్మాణాత్మక సంస్కరణలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలను పటిష్టం చేయటం, నిత్యావసరాల వస్తువుల చట్టం, నక్సలైట్ల ప్రభావం ఉన్న జిల్లాల్లో భద్రతా వ్యవహారాల అంశాలపై దృష్టి సారించనున్నారు.
ఇదిలా ఉంటే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు.