జాతీయ వార్తలు

ఐదేళ్లలో ఆర్థిక శక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: రానున్న ఐదేళ్లలో భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 2024 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించడం సవాలే అయినప్పటికీ అసాధ్యమేమీ కాదని అన్నారు. శనివారం ఇక్కడ జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి ఐదో సమావేశాన్ని ప్రారంభించారు. స్థూల జాతీయోత్పత్తిని పెంచేందుకు జిల్లా స్థాయి నుంచీ ప్రయత్నాలు జరగాలని ఈ సందర్భంగా రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. దేశంలో అనేక ప్రాంతాల్లో నెలకొన్న కరవుకాటక పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఫలవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని మోదీ స్పష్టం చేశారు. మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), కె.చంద్రశేఖర రావు (తెలంగాణ) మినహా దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనారోగ్య కారణంగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన తరపున మనుప్రీత్‌ను పంపించారు. నీతి ఆయోగ్‌కు ఎలాంటి ఆర్థిక అధికారాలు లేవని, ఇది నిరుపయోగ సంస్థ అని గతంలో విమర్శించిన మమత ఈ సమావేశానికి హాజరు కావడం లేదని ముందే ప్రకటించారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం పనుల్లో నిమగ్నమైన కారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశానికి రాలేదు. ఈ సమావేశంలో మాట్లాడిన మోదీ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఉత్సవంగా అభివర్ణించారు. భారత దేశ సమగ్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలసికట్టుగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పేదరికం, నిరుద్యోగం, క్షామం, కాలుష్యం, అవినీతి, హింసా ప్రవృత్తిని పారదోలేందుకు ఉమ్మడిగా పోరాటం జరగాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. 2022నాటికి నవభారతాన్ని నిర్మించాలన్నది ప్రతి ఒక్కరి ఉమ్మడి లక్ష్యమన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఎంతటి విజయాలను సాకారం చేసుకోవచ్చునో స్వచ్ఛ్భారత్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన రుజువు చేశాయన్నారు. ప్రతి భారతీయుడికి సాధికారత, జీవన సౌలభ్యాలను సమకూర్చాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. మహాత్మా గాంధీ 150 జయంతి నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలను అక్టోబర్ రెండు నాటికే సాకారం చేసుకోవాలని, దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికల్లా సాధించ దలచుకున్న లక్ష్యాల దిశగానూ వెంటనే పనులు మొదలు కావాలని మోదీ పిలుపునిచ్చారు. స్వల్పకాల, దీర్ఘకాల లక్ష్యాలపై దృష్టి పెట్టి వాటి సాధనకు ఉమ్మడి బాధ్యతతో ప్రయత్నించాలన్నారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థను అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దడం గురించి మాట్లాడిన ప్రధాని 2024నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమన్నది సవాలే అయినా అసాధ్యం కాదని, ఇందుకు ఉమ్మడి శక్తితో ముందుకెళ్లడం ఎంతో అవసరమని పునరుద్ఘాటించారు. ఈ ఏడాది మార్చి నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 2.75 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. రాష్ట్రాలు తమ వౌలిక సామర్థ్యాలపై దృష్టి పెట్టి అట్టడుగు స్థాయి నుంచీ జీడీపీ వృద్ధికి తోడ్పడాలన్నారు. అలాగే ఎగుమతులనూ విస్తృతం చేసుకునే దిశగా ఉమ్మడి ప్రయత్నాలు జరగాల్సిన అవసరమూ ఎంతో ఉందని తెలిపారు. ప్రతి నీటి బొట్టునూ వినియోగించుకుని పంటల్ని విస్తరించుకోవడం ద్వారా క్షామ పరిస్థితులను ఎదుర్కోవాలని మోదీ తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసే లక్ష్యానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీన్ని సాధించాలంటే ఫిషరీలు, పశువుల పెంపకం, పూతోటల పెంపకం, ఫలాలు, కూలగాయల పంటలపై దృష్టి పెట్టాలన్నారు.

చిత్రం...రాష్ట్రపతి భవన్‌లో శనివారం నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశమైనప్పటి దృశ్యం