జాతీయ వార్తలు

అన్ని విధాలా ఆదుకుంటాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముజఫర్‌పూర్, జూన్ 16: రాష్ట్రంలో పిల్లల మరణాలకు దారి తీస్తున్న మెదడు వాపు వ్యాధి, హైపోగ్లిసేమియాను ఎదుర్కొనేందుకు బీహార్ ప్రభుత్వాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ ఆదివారం నాడిక్కడ వెల్లడించారు. మృతి చెందిన పిల్లల కుటుంబాలను ముజఫర్‌పూర్‌లో ఆయన పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా సహాయపడుతుందని హామీ ఇచ్చారు. ఇదిలాఉండగా బీహార్‌లో చిన్నారుల పాలిట మెదడ వాపు లక్షణాలు కలిగిన వ్యాధి మృత్యుకూపంగా మారుతోంది. తాజాగా ఆదివారం ముజఫర్‌పూర్‌లో మరో చిన్నారి ఈ వ్యాధి కారణంగా మరణించడంతో మృతుల సంఖ్య 83కు పెరిగింది. ఈ వ్యాధి తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున సహాయాన్ని ప్రకటించారు. ఈ వ్యాధి తీవ్రతను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య విభాగం అధికారులను, జిల్లా పాలనా యంత్రాంగాన్ని, వైద్యులను ఆయన ఆదేశించారు. ఇప్పటికే ఈ వ్యాధి కారణంగా చికిత్స పొందుతున్న చిన్నారులు త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు నితీష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ, కేజ్రీవాల్ ఆసుపత్రుల్లోని 83 మంది చిన్నారులు మరణించారు. వీరిలో 69 మంది పిల్లలు శ్రీకృష్ణ మెడికల్ కాలేజీ-ఆసుపత్రిలో, మరో 14 మంది కేజ్రీవాల్ ఆసుపత్రిలో మరణించారు. అయితే మృతి చెందిన పిల్లల్లో ఎక్కువ మంది 10 సంవత్సరాల లోపు వారేనని, వీరి మరణానికి రక్తంలో చక్కెర శాతం దారి తీసే హైపొగ్లిసేమియా వ్యాధే కారణమని అధికారులు చెబుతున్నా రు. జూన్ 1వ తేదీ నుంచి ఈ రెండు ఆసుపత్రుల్లో కలిపి దాదాపు 180 మంది పిల్లలు మెదడు వాపు వ్యాధి లక్షణాల కారణంగా చేరినట్లుగా తెలుస్తోం ది. అయితే చికిత్స అనంతరం వీరికి హైపొగ్లిసేమి యా వ్యాధే సోకినట్లు తేలిందని తెలిపారు.

చిత్రాలు.. ఆదివారం బీహార్ వచ్చిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను అడ్డుకుంటున్న జన అధికారి పార్టీ కార్యకర్తలు..
*ముజఫర్‌పూర్‌లోని శ్రీకృష్ణ వైద్య కళాశాల-ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు