జాతీయ వార్తలు

ఇటు ఉత్సాహం.. అటు నైరాశ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: పదిహేడవ లోక్‌సభ మొదటి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం త్రిపుల్ తలాక్ తదితర బిల్లులను మరోసారి ప్రతిపాదించేందుకు సిద్ధమవుతుండగా 22 మంది సభ్యులున్న వైఎస్‌ఆర్‌సీపీ, ముగ్గురు సభ్యులున్న తెలుగుదేశం ప్రత్యేక హోదాకోసం పట్టుపట్టనున్నాయి. భారీ విజయం మూలంగా బీజేపీలో ద్విగుణీకృత ఉత్సాహం కనిపిస్తుంటే.. ఘోర పరాజయం మూలంగా ప్రతిపక్షాల్లో నైరాశ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బడ్జెట్-వర్షాకాల సమావేశాలుగా నామకరణం చేసిన పదిహేడవ లోక్‌సభ మొదటి సమావేశాల మొదటి రెండు రోజులు కొత్త సభ్యుల సభ్యత్వ ప్రమాణాలతో గడుస్తుంది. 19న స్పీకర్ ఎన్నిక, 20న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జూలై ఐదో తేదీనాడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రతిపాదిస్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ 303 సీట్లతో భారీ విజయం సాధించటం.. ఎన్‌డీఏ 352 సీట్లు గెలుచుకోగా ప్రతిపక్షాలు ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో జరుగుతున్న పదిహేడవ లోక్‌సభ మొదటి సమావేశాలకు ఏంతో ప్రాధాన్యత ఉన్నది. పార్లమెంటు ఉభయ సభల్లో ఎన్‌డీఏను నిలువరించేందుకు అనుసరించవలసిన వ్యూహం గురించి చర్చించేందుకు ప్రతిపక్షాల సమావేశం ఇంతవరకు జరగలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలిసింది. ఇతర ప్రతిపక్షాలు కూడా పార్లమెంటులో అనుసరించవలసిన వ్యూహం గురించి చర్చించేందుకు సమావేశం జరిపే సూచనలేవీ కనిపించటం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం ప్రతిపక్షాలు ఏ స్థాయిలో కుంగదీసిందనేందుకు ఈ పరిస్థితి అద్దం పడుతోంది. కాంగ్రెస్‌కు చెందిన మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ, జ్యోతిరాధిత్య సింధియా తదితర సీనియర్లందరు ఓడిపోవటం తెలిసిందే. ఇదే విధంగా సీపీఎంకు చెందిన మహమ్మద్ సలీం లాంటి సీనియర్ నాయకులు సైతం విజయం సాధించలేకపోయారు. ప్రతిపక్షంలో సీనియర్ నాయకులెవ్వరు లేరు. దీనితో మోదీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలువరించగలిగే నాయకులెవ్వరూ ప్రతిపక్షంలో లేరు. టీఎంసీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు గెలిచినందున ప్రతిపక్షం తన గొంతును కొంతైనా వినిపించగలుగుతుంది. పదిహేడవ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటున్న రాహుల్ గాంధీ లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకత్వం చేపడతారా లేదా అనేది స్పష్టం కావటం లేదు. కాంగ్రెస్‌కు రెండు సీట్లు తక్కువగా ఉన్నందున ప్రధాన ప్రతిపక్షం హోదా లభించే సూచనలు కనిపించటం లేదు. అమేథీలో ఘోరపరాజయం పాలైనా కేరళలోని వాయినాడ్ నుండి లోక్‌సభకు ఎన్నికైన రాహుల్ గాంధీ సభకు క్రమం తప్పకుండా హాజరయ్యే అవకాశాలు కనిపించటం లేదు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు ఎవరవుతారనేది ఇంకా స్పష్టం కాకపోవటంతో సభలో కాంగ్రెస్ పని తీరు ఎలా ఉంటుందనేది వేచి చూడవలసిందే. అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎంకు ఇప్పుడు సభలో ఒవైసీకి మహారాష్ట్ర నుండి ఒకతోడు లభించటం తెలిసిందే.
భారీ మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ లోక్‌సభలో మరోసారి త్రిపుల్ తలాక్ బిల్లును ప్రతిపాదించనున్నది. గత పార్లమెంటులో త్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర పడినా రాజ్యసభలో ఇరుక్కుపోవటం తెలిసిందే. త్రిపుల్ తలాక్ బిల్లు ఈసారి రాజ్యసభలో ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బిల్లుతోపాటు మరికొన్ని ముఖ్యమైన బిల్లులను బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించనున్నది. సిటిజన్స్ రిజిష్టర్ బిల్లును ఆమోదింపజేసేందుకు బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించనున్నది. వైఎస్‌ఆర్‌సీపీ, తెలుగుదేశం పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా కోసం పట్టుపట్టనున్నాయి.

చిత్రం...సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం దృశ్యం.