జాతీయ వార్తలు

మిస్ ఇండియా వరల్డ్‌గా సుమన్ రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 16: మిస్ ఇండియా వరల్డ్-2019గా రాజస్థాన్‌కు చెందిన సుమన్ రావు ఎంపికయ్యారు.ముంబయిలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోటీల్లో రాజస్థాన్‌లో సీఏ చదువుతున్న సుమన్ రావు మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. చత్తీస్‌గఢ్‌కు చెందిన శివానీ జాదవ్ మిస్ ఇండియా-2019 రన్నరప్‌గా నిలిచింది. బిహార్‌కు చెందిన మేనేజిమెంట్ కోర్సు విద్యార్థిని శ్రేయా శంకర్ మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్-2019 టైటిల్‌ను సాధించింది. తెలంగాణకు చెందిన సంజనా విజ్ మిస్ ఇండియా రన్నర్ అప్‌గా నిలిచింది. ప్రఖ్యాత డిజైనర్ ద్వయం ఫల్గుణి షేన్ పీకాక్, మిస్ వరల్డ్-2018 వనెస్సా పొంకా డెలెయాన్, బాలీవుడ్ నటులు హ్యూమా ఖురేషీ, చిత్రాంగద సింగ్, ఆయుష్ శర్మ, కొరియోగ్రాఫర్-చిత్ర నిర్మాత రెమో డిసౌజా, స్ప్రింటర్ దుతీ చంద్, భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.