జాతీయ వార్తలు

బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జేపీ నడ్డా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 17: హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జయప్రకాశ్ నడ్డాను బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షా మహారాష్ట్ర తదితర రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు జరిగేంతవరకు కొనసాగుతారు. అయితే పార్టీ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించేందుకు నడ్డాను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. అమిత్ షా డిసెంబర్ వరకు అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఆ తరువాత జేపీ నడ్డా పూర్తిస్థాయి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. రానున్న ఆరు నెలల పాటు అమిత్ షా సలహా మేరకు పార్టీ పనులన్నీ నడ్డా నిర్వహిస్తారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన నడ్డాను నరేంద్ర మోదీ, అమిత్ షా, ఇతర సీనియర్ నాయకులు అభినందించారు. అమిత్ షా హోంశాఖ పనులతో తీరిక లేకుండా ఉండటం వలన పార్టీ రోజువారీ కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. బీజేపీ అధ్యక్షుడు పూర్తి సమయాన్ని పార్టీ కార్యకలాపాలకు ఇవ్వకపోతే సమస్యలు ఎదురవుతాయనే ఆలోచనతోనే నడ్డాను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపిక చేశారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా ఇకమీదట హోం శాఖ కార్యకలాపాలతోపాటు పార్టీకి సంబంధించిన విధాన నిర్ణయాలు, మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల శాసనసభల ఎన్నికల వ్యూహాలపై దృష్టి కేంద్రీకరిస్తారని చెబుతున్నారు.