జాతీయ వార్తలు

‘జమిలి’ రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశంలో సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, సీపీఐ నుంచి సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజా పాల్గొన్నారు. అనంతరం సీతారాం ఏచూరి మాట్లాడుతూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సమాఖ్య, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు లేదా ఎన్నికల్లో ఓటమి చెందడం, మనీ బిల్లుకు ఆమోదం లభించనప్పుడు మాత్రమే ప్రభుత్వం వైదొలగాల్సి ఉంటుందన్నారు. అ తరువాతే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని లేదా మధ్యంతర ఎన్నికల జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే ఆర్టికల్ 83(2), ఆర్టికల్ (172(1) ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీ పదవీ కాలం లేదా రద్దయ్యే వరకు కొనసాగుతాయని ఈ సమావేశంలో పేర్కొన్నట్టు చెప్పారు. దీనికి విరుద్ధంగా లోక్‌సభ, అసెంబ్లీ పదవీకాలాన్ని పొడిగించడం రాజ్యాంగ విరుద్ధమని ఏచూరి పేర్కొన్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ జమిలి ఎన్నికలు సమాఖ్య స్పూర్తికి పూర్తిగా విరుద్ధమని కేంద్రానికి స్పష్టం చేసినట్టు తెలిపారు. జమిలి ఎన్నికల ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఎన్నికల నిర్వహణకు అనేక సమస్యలు కూడా వస్తాయని కేంద్రానికి స్పష్టం చేసినట్టు సురవరం వెల్లడించారు.