జాతీయ వార్తలు

ఎమర్జెన్సీ యోధులకు అభివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ‘నాడు ఎమర్జెన్సీని ఎదుర్కొని గట్టిగా నిలబడి పోరాటం చేసిన వారికి శెల్యూట్ చేస్తున్నా..’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్న తపనతో నిరంకుశత్వాన్ని ఎదిరించి అసువులు బాసిన వారికి నివాళి అర్పిస్తున్నాని ఆయన తెలిపారు. వారందరికీ యావత్ దేశ ప్రజలు శెల్యూట్ చేస్తున్నారని ప్రధాని మోదీ మంగళవారం ట్వీట్ చేశారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1975 సంవత్సరం, జూన్ 25న దేశంలో అత్యవసర పరిస్థితి (విధించి) ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మోదీ ధ్వజమెత్తారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ట్విట్టర్‌లో 1975 సంవత్సరం నాటి అత్యవసర పరిస్థితి దేశానికి మాయని మచ్చ వంటిదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ హతమార్చిందని ఆయన విమర్శించారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్న వేలాది మంది జన్ సంఘ్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యరక్తలను ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపిందని ఆయన తెలిపారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేస్తూ ఎమర్జెన్సీ దేశ చరిత్రలో చీకటి రోజులని పేర్కొన్నారు. 1975 సంవత్సరం జూన్ 25న ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి తప్పు చేశారని ఆయన తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు ఎన్నో విధాలుగా ఇబ్బంది పడ్డారని, పత్రిక స్వేచ్చను హరించిందని విమర్శించారు. దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రాణాలు వదిలిన వారందరికీ శెల్యూట్ చేస్తున్నానని ఆయన తెలిపారు.
పెన్షన్లు ఇస్తాం..
ఇదిలాఉండగా ఎమర్జెన్సీ కాలంలో అరెస్టు అయిన వారికి పెన్షన్లు ఇస్తామని, అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా ఇస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఎమర్జెన్సీ కాలంలో అరెస్టు అయిన వారిలో చాలా మంది ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారని, తమ తప్పు ఏమీ లేకపోయినా అరెస్టు అయిన కారణంగా ఉద్యోగాలు కూడా కోల్పోయారని ఆయన వెల్లడించారు.