జాతీయ వార్తలు

నాలుగు రాష్ట్రాలకూ పంచాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: కృష్ణా నది జలాల పంపకం వివాదంపై ట్రిబ్యునల్‌లో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును ఎప్పుడు వెలువరించేది మూడు వారాల తరువాత ప్రకటిస్తామని ట్రిబ్యునల్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్-89 పరిధిపై జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు కేంద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వాదనలు ముగిశాయి. ట్రిబ్యునల్ ముందు గురువారం ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి. ముందుగా ఏపీ తరపున సీనియర్ న్యాయవాది ఏకె గంగూలి వాదనలు వినిపిస్తూ విభజన చట్టంలోని సెక్షన్-89 ప్రకారం నీటి కేటాయింపులు తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేయాలని భావించి ఉంటే విభజన చట్టంలో ట్రిబ్యునల్‌ను ప్రస్తావించకపోయేదని వాదించారు. నీటి కేటాయింపులు నాలుగు రాష్ట్రాల మధ్య జరగాలని ట్రిబ్యునల్‌ను కోరారు. గత రెండేళ్లుగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో మహారాష్ట్ర, కర్ణాటక పరిధిలోని రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయని, అదే దిగువన ఉన్న నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటాయన్నారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు నాలుగు రాష్ట్రాల మధ్య చేపడితేనే ఏపీ, తెలంగాణలకు న్యాయం జరుగుతుందని అన్నారు. దీనికి కర్ణాటక తరపు సీనియర్ న్యాయవాది నారిమన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తున్నట్టు 2009లోనే ప్రకటన వెలువడినా, నీటి కేటాయింపులలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ట్రిబ్యునల్‌ను కాని, సుప్రీంకోర్టును కాని తెలంగాణ నుండి పార్టీలు కాని, సంస్థలు కాని ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ వాదనల పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని సెక్షన్-89 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మాత్రమే నీటి పంపకాన్ని పరిమితం చేయాలని ఆయన వాదించారు. ఏపీ, తెలంగాణ వాదిస్తున్నట్టు సెక్షన్-89 ప్రకారం కృష్టా జలాలను 4 రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తే, గోదావరి జలాలను కూడా ట్రిబ్యునల్‌లోకి తీసుకు రావలసి ఉంటుందన్నారు. అలా అయితే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని రాష్ట్రాలు నీటి పంపకాల కోసం ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలా? అని ఆయన ప్రశ్నించారు.