జాతీయ వార్తలు

నాణ్యతలో లోపం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: కోల్‌కతాలో ఫ్లై ఓవర్ కూలిపోయిన ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా పశ్చిమబంగాల్ పోలీసుబృందం హైదరాబాద్ చేరుకుంది. ఫ్లైఓవర్ పనులు నిర్వహిస్తున్న ఐవిఆర్‌సిఎల్ కంపెనీ కార్యాలయం హైదరాబాద్‌కు చెందినదిగా గుర్తించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ పోలీసుల సహాయంతో బంగాల్ పోలీసులు శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లి సోదాలు చేశారు. ఆ సంస్థ ప్రతినిధులను విచారించారు. వచ్చే మూడు రోజుల్లో కోల్‌కొత్తాకు వచ్చి విచారణకుహాజరు కావాలని ఆ రాష్ట్ర పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇదిలావుండగా ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి తాము తయారు చేసిన డిజైన్‌లోగానీ, నాణ్యత ప్రమాణాల్లో గానీ ఎలాంటి లోపం లేదని ఐవిఆర్‌సిఎల్ లీగల్ హెడ్ సీత, పరిపాలనాధికారి పాండురంగారావు తెలిపారు. ఇప్పటి వరకు నిర్మాణం పూర్తయిన 59 పిల్లర్లు, శ్లాబులకు ఎలాంటి మెటీరియల్ వాడామో, ఇప్పుడు కూలిపోయిన పిల్లర్లకు, శ్లాబులకు అదే మెటీరియల్ వాడామని వారు చెప్పారు. ఎందుకు కూలిపోయిందో అర్ధం కావడం లేదని, దురదృష్టవశాత్తు జరిగిందని భావిస్తున్నట్లు తెలిపారు. దీనిపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి, అక్కడి పోలీసు యంత్రాంగానికీ పూర్తిగా సహకరించాలని తమ కంపెనీ తరఫున ప్రతినిధులను ఇప్పటికే కోల్‌కతా పంపించామని తెలిపారు.

చిత్రం హైదరాబాద్‌లో శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతున్న ఐవిఆర్‌సిఎల్ లీగల్ హెడ్ సీత