జాతీయ వార్తలు

దేశవ్యాప్తంగా 19.47 లక్షల డాక్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: దేశ వ్యాప్తంగా 19.47 లక్షలకుపైగా వైద్యులు అందుబాటులో ఉన్నారని కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు. అలోపతి, ఆయుర్వే, యూనానీ, హోమియోపతి డాక్ట ర్లు ఉన్నారని ఆయన శుక్రవారం లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 11,59,309 అలోపతి డాక్టర్లు రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్స్‌లో, కేంద్ర మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయన తెలిపారు. 80 శాతం మంది (9.27 లక్షల) డాక్టర్లు చురుగ్గా ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. ఇక జనాభా 1.35 బిలియన్లు ఉండగా నిష్పతి ప్రకారం చూస్తే 1456 మందికి ఓ డాక్టరు ఉన్నట్లు ఆయన వివరించారు. ఇది డబ్ల్యుహెచ్‌వో (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) నియమానికి తక్కువేనని అన్నారు.
7.88 లక్షల మంది ఆయుర్వేద డాక్టర్లు, యూనానీ, హోమియోపతి డాక్టర్లు 80 శాతం మంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. ప్రజల సంఖ్యకు తగిన విధంగా డాక్టర్లు ఉన్నారా? అనే కోణంలో నిష్పత్తి ప్రకారం చూస్తే డబ్ల్యుహెచ్‌వో నియమం కంటే ఎక్కువే ఉన్నారని కేంద్ర మంత్రి హర్షవర్దన్ చెప్పారు. మొత్తం 19,47,309 వైద్యులు ఉన్నారని ఆయన వివరించారు.
ఆర్థికంగా వెనుకబడిన వారికి 4,800 ఎంబీబీఎస్ సీట్లు
ఇలాఉండగా కేంద్ర మంత్రి హర్షవర్దన్ మరో ప్రశ్నకు సమాధానమిస్తూ 4,800 ఎంబీబీఎస్ సీట్లు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్తుల కోసం రిజర్వ్ చేసినట్లు తెలిపారు. 24,698 సీట్లను అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య కళాశాలల్లో పెంచినట్లు చెప్పారు. 15,815 అండర్ గ్రాడ్యుయేట్ సీట్లను, 2,153 పీజీ సీట్లను 2017-18, 2019-20 విద్యా సంవత్సరాల్లో పెంచినట్లు ఆయన వివరించారు. 75,000 ఎంబీబీఎస్ సీట్లు 3నీట్2 కోసం ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో కొత్తగా 82 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎంబీబీఎస్ కోర్సులకు గుర్తింపు పొందిన వైద్య కళాశాలన్నీ మూడేళ్ళలో పీజీ కోర్సులనూ తప్పని సరిగా ప్రారంభించాలని కేంద్ర మంత్రి సూచించారు.