జాతీయ వార్తలు

రంగంలోకి సైన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, జూలై 12: అస్సాంలో వరద పరిస్థితి శుక్రవారం మరింత విషమించడంతో తక్షణ సహాయ చర్యలు చేపట్టేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపారు. ఇప్పటి వరకు వరద తీవ్రతకు ఆరుగురు మరణించారు. 21 జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల నుంచి ఏడున్నర లక్షలకు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నీటిలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, రాష్ట్ర దళాలు చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా సైన్యాన్ని కూడా బక్సా జిల్లాలో దింపినట్లు అధికారులు తెలిపారు. గోపాల్‌ఘట్, దిమా అసావో జిల్లాల్లో వర్షానికి వరదలు తోడు కావడంతో మరో ముగ్గురు మరణించారని అధికారులు వెల్లడించారు. అలాగే, గోఖాకట్‌లో ఇద్దరు కొండచరియలు విరిగిపడి ఒకరు మరణించినట్లు తెలిపారు. చిరాగ్, నల్బరీ, బక్సా, బార్‌పేట తదితర జిల్లాలు తీవ్ర స్థాయిలో ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలకు గాను 21 జిల్లాల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.