జాతీయ వార్తలు

మైత్రి మరింత బలపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: భద్రత, ఇంధనం, జలవనరులు వంటి కీలక అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని భారత్, నేపాల్ దేశాలు నిర్ణయించుకున్నాయి. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, నేపాల్ విదేశాంగ మంత్రి ప్రకాష్ శరన్ మహత్‌తో సోమవారం ఇక్కడ సమావేశమై పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. నేపాల్ ప్రధాని ప్రచండ ఈ నెల 15 భారత్‌లో పర్యటించనున్న దృష్ట్యా ఇరుదేశాల విదేశాంగ అధిపతుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గత నెలలో ప్రచండ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇలాంటి ఉన్నతస్థాయి సమావేశం జరగడం తొలిసారి. ‘ద్వైపాక్షి సంబంధాలు బలోపేతం అలాగే కీలకమైన అంశాల్లో పరస్పర సహకారం అందించుకుకోవాలని ఇరుదేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో నిర్ణయించారు’ అని ఓ అధికార ప్రకటనలో తెలిపారు. భారత్, నేపాల్ మధ్య స్నేహం ఈనాటికి కాదని దాన్ని మరింత పటిష్టం చేయడంతోపాటు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఆర్థిక అంశాల్లో కలిసి పనిచేయాలని ఉభయులు నిర్ణయించారు. నేపాల్ ప్రధాని ప్రచండ త్వరలో భారత్‌లో పర్యటించనున్న దృష్ట్యా ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. ప్రచండ నాలుగు రోజులు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ సమస్యలపై ఆయన చర్చిస్తారు. నేపాల్ కొత్త రాజ్యాంగంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతోపాటు సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వ్యాపార, వాణిజ్య సంబంధాలు నెలల తరబడి స్తంభించిపోయాయి.

చిత్రం.. నేపాల్ విదేశాంగ మంత్రి ప్రకాష్ శరన్ మహత్‌తో సుష్మా స్వరాజ్