జాతీయ వార్తలు

నీట్-పీజీ లేకుండానే నేరుగా ఎండీ, ఎంఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: పీజీ కోర్సులు చేయాలనుకొనే వైద్య విద్యార్థులకు ఊరట లభించనుంది. నీట్-పీజీ రాయకుండానే ఎంబీబీఎస్ విద్యార్థులు నేరుగా పీజీ కోర్సులకు వెళ్లే విధానం త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సవరణ బిల్లును కేంద్ర మంత్రి వర్గ ఆమోదానికి జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) త్వరలోనే పంపన్నట్లు ఆదివారం అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాన మంత్రి కార్యాలయ ఆదేశాలకు అనుగుణంగా దీని మార్గదర్శకాలను రూపొందించనున్నారు. దేశ వ్యాప్తంగా వైద్య విద్యార్థులందరికీ ఒకే విధమైన పీజీ వైద్య కోర్సులకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నిర్వహిస్తారు. దీనివల్ల పీజీ అడ్మిషన్ పొందడానికి ఎంబీబీఎస్ పూర్తి చేసుకొన్న విద్యార్థులు ప్రత్యేకంగా మరో పరీక్ష ఏదీ రాయనవసరం లేదని వివరించారు. అలాగే, ఎంబీబీఎస్ పూర్తిచేసుకొన్న విద్యార్థులు ప్రత్యేకంగా ప్రాక్టీస్ లైసెన్స్ కూడా పొందాల్సిన అవసరం ఉండదు. అయితే, ఎయిమ్స్‌లో పీజీ కోర్సులకు మాత్రం కచ్చితంగా ప్రత్యేక పరీక్షను రాయాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో డీఎం/ఎంసీహెచ్ అడ్మిషన్లకు నీట్ సూపర్ స్పెషాలిటీ ప్రవేశపరీక్షను కూడా వైద్య విద్యార్థులు రాయాలి. కాగా, దేశవ్యాప్తంగా ఉన్న 480 వైద్య కళాశాలల్లో ఏటా 80వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. అలాగే, 50వేల పీజీ సీట్లకు లక్షా 50వేల మంది పోటీ పడుతున్నారు. ఇదిలా ఉండగా జాతీయ వైద్య కమిషన్ బిల్లును 2017 డిసెంబర్‌లో లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పటికీ 16వ సభ రద్దుకావడంతో బిల్లు ఆమోదానికి నోచుకోలేదు.