జాతీయ వార్తలు

బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ఎందుకు ప్రకటించటం లేదని టీఆర్‌ఎస్ సభ్యుడు రంజిత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టుగా గురించలేని పక్షంలో కనీసం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టునైనా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని రంజిత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది.. కేంద్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయటం లేదని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని ఆయన వెల్లడించారు. గురువారం లోక్‌సభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో రంజిత్ రెడ్డి పాల్గొంటూ.. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ల పథకానికి 10వేల కోట్లు కేటాయిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ పథకం కోసం 11వేల కోట్లు కేటాయించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం కేవలం 2వేల కోట్లు ఇచ్చిందని రంజిత్‌రెడ్డి తెలిపారు. వౌలికరంగాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేవలం 10వేల కోట్లు కేటాయిస్తా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ రంగానికి 40వేల కోట్లు కేటాయించారని.. ఇంటింటికీ పైపుల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నారని ఆయన చెప్పారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని చెరువులను మెరుగుపరుస్తున్నారంటూ ఈ పథకాన్ని నీతి ఆయోగ్ కూడా ప్రశంసించిందని అన్నారు. తెలంగాణలో ఉన్నది సమర్థంగా పనిచేసే ప్రభుత్వం.. తమ ప్రభుత్వం సంక్షేమం పథకాలకు గత సంవత్సరం రెండు లక్షల కోట్లు ఖర్చు చేసింది. రెండు లక్షల కోట్ల రూపాయలను అభివృద్థి పథకాలకు ఖర్చు చేసిందని రంజిత్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ లాంటి యువ రాష్ట్రానికి మేలు చేసినప్పుడే ఎన్‌డీఏ ప్రభుత్వం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించగలుగుతుందని ఆయన స్పష్టం చేశారు. పీఎం గ్రామ రోడ్డు పథకంలోని లోపాలను సరిదిద్దాలని ఆయన సూచించారు. గృహ నిర్మాణంలో కూడా తెలంగాణకు న్యాయం జరగలేదని ఆరోపించారు.