జాతీయ వార్తలు

గుంటూరులో మిర్చి బోర్డును ఏర్పాటుచేయాలి: లావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: గుంటూరు జిల్లాలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని వైసీపీ లోక్‌సభ సభ్యుడు లావు కృష్ణదేవరాయులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో లేవనెత్తారు. దేశంలో అత్యధికంగా గుంటూరులోనే మిర్చి ఉత్పత్తి అవుతోందని ఈ ప్రాంతంలో మిర్చి బోర్టును ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే గోదావరి నదిపై నరసాపురం-సఖినేటిపల్లి మధ్య వంతెన నిర్మించాలని నరసాపురం లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్టంరాజు కేంద్రాన్ని కోరారు. ఈ అంశాన్ని ఆయన లోక్‌సభ జీరో అవర్‌లో లేవనేత్తారు. 40 సంవత్సరాలుగా గోదావరి ప్రాంత ప్రజలు ఈ రెండు ప్రాంతాల మధ్య వంతెనకోసం ఎదురు చూస్తున్నారని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.