జాతీయ వార్తలు

హిందీని రుద్దే ప్రసక్తి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూలై 20: కేంద్ర ప్రభుత్వం తమిళనాడులో హిందీ భాషను రుద్దడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పేర్కొన్నారు. కేంద్రం తమిళ భాషను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు. ఇటీవల తపాలా శాఖలో ఉద్యోగాల నియామకాల రాత పరీక్షను ఇంగ్లీషు, హిందీ భాషల్లో మాత్రమే నిర్వహించడాన్ని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు నిరసిస్తున్న నేపథ్యంలో శనివారం ఇక్కడ కొంతమంది విలేఖరులకు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ నిర్మలా సీతారామన్ ఈ విషయం చెప్పారు. ఇంగ్లీషు, హిందీ భాషల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించడాన్ని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ‘తమిళనాడులో హిందీని రుద్దడమేనని’ ఆరోపించారు. 1960లలో తమిళనాడులో ద్రవిడ మునే్నట్ర కజగం (డీఎంకే) నేతృత్వంలో హిందీ వ్యతిరేక ఉద్యమం విజయవంతంగా సాగింది. ప్రభుత్వానికి తెలిసి జరిగిందా? తెలియకుండ జరిగిందా? అని ఎవరయినా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చని, కాని, హిందీ భాషను రుద్దుతున్నారని అంతిమ నిర్ణయానికి రాకూడదని ఆమె అన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం హిందీని రుద్దే పనిచేయదు’ అని ఆమె పేర్కొన్నారు. ‘పరిపాలన స్థాయిలో ఎక్కడో ఒక చోట ఏదో జరిగితే, దానిని రుద్దడం అనే అంతిమ నిర్ణయానికి రాకూడదు. ఖచ్చితంగా హిందీని రుద్దడం లేదు. తమిళ భాషను అభివృద్ధి చేయడానికి కూడా మేము కృషి చేస్తున్నాం’ అని నిర్మలా సీతారామన్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ పథకంలో భాగంగా ఉత్తరాది రాష్ట్రాలలో తమిళ భాషకు ప్రాచుర్యం పెంచడానికి కృషి చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. హిందీని రుద్దడం లేదని ఆమె పునరుద్ఘాటించారు.
చిత్రం... చెన్నైలో శనివారం జ్యోతిని వెలిగించి ఓ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్