జాతీయ వార్తలు

దక్షతకు చుక్కాని దీక్షిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : సైద్ధాంతిక విబేధాలతో నిమిత్తం లేకుండా అన్ని పార్టీలతోనూ కలిసి పని చేసి వ్యక్తిత్వం షీలాదీక్షిత్‌ది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పాటు పని చేసిన ఘనతను సాధించడంతో పాటు దేశ రాజధానికి ఆధునిక రూపాన్ని అందించిన నాయకత్వ పటిమ కూడా ఆమెదే.
గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా మెసిలిన దీక్షిత్ ఉద్దేశంలో రాజకీయాలంటే ప్రజలకు సన్నిహితం కావడం, నిరంతర శక్తితో అలుపులేకుండా పని చేయడమే. పంజాబ్‌లోని కపుర్తాలలో ఓ రాజకీయ కుటుంబంలో 1938లో జన్మించిన షీలాదీక్షిత్ చదువంతా ఢిల్లీలో సాగింది. 1962 జూలైలో అప్పటి ప్రధాని నెహ్రూకు సన్నిహితుడైన ఉమాశంకర్ దీక్షిత్ కుమారుడైన వినోద్ దీక్షిత్‌తో ఆమె వివాహాం అయ్యింది. 1971లో ఇందిరా గాంధీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన షీలాదీక్షిత్ అనంతరం కర్నాటక, పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కూడా పని చేశారు. 1998, 2003, 2008లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రాగలిగిన జనాకర్షక నేతగా ఆమె నిలిచారు. ఆమె హయాంలోనే దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ సొబగులను సంతరించుకుంది. ప్రభుత్వ రవాణా రంగంలో విస్తృత మార్పులు తెచ్చిన దీక్షిత్ సీఎన్‌జీకి కూడా నాంది పలికారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా 15 ఏళ్ళ పాటు పని చేసిన ఆమె అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దేశ రాజధానికి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టారు. అనేక ఫ్లైవోవర్లను నిర్మించడం ద్వారా ట్రాఫిక్ పరంగా ప్రజలకు ఊరట కలిగించారు. ప్రజలకు భాగస్వామ్యం కలిగించే రీతిలో పాలనకు మెరుగు పెట్టిన ఆమె అందరితోనూ సన్నిహితంగా మెలిసి, రాజకీయాలకు కొత్త అర్థాన్నిచ్చారు. తరచూ మురికి వాడల ప్రాంతాలను సందర్శించి, సామాన్యులతో కలిసి తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు. సంగీతం అంటే చెవి కోసుకునే షీలాదీక్షిత్‌కు పాశ్చాత్య సంగీతం అంటే ఎనలేని మక్కువ. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా వీలు చూసుకుని సినిమా చూడడం ఆమెకు అలవాటుగా మారింది. అలాగే పఠనాభిలాష కూడా షీలా దీక్షిత్‌కు ఎక్కువగానే ఉండేది. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న దీక్షిత్‌కు 2013లో కేజ్రీవాల్ సారథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయంతో ఎదురు దెబ్బ తగిలింది. ఆ ఎన్నికల్లో కేజ్రీవాల్ చేతిలోనే ఆమె ఓడిపోయారు. అయినప్పటికీ షీలాదీక్షిత్‌లో రాజకీయపరమైన పట్టుదల, మళ్లీ నిలదొక్కుకోవాలన్న ఆరాటం ఏ మాత్రం తగ్గలేదు. కాంగ్రెస్‌కు పూర్వ వైభవాన్ని కలిగించేందుకు నిరంతరం శ్రమించారు. తాజాగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని యూపీ సర్కారు నిర్బంధించిన అంశంపై ఓ పెద్ద నిరసన కార్యక్రమానికి ఆమె సమాయత్తమయ్యారు.
చిత్రాలు..షీలా దీక్షిత్‌కు ప్రత్యర్థులే లేరు.. అన్ని పార్టీల నేతలు ఆమెకు సమానమే.
యూపీఏ చైర్ పర్సన్ సోనియాతో ఆత్మీయ సందర్భం ఒకటైతే,
బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్‌తో పలకరింపు ఇందుకు నిదర్శనం