జాతీయ వార్తలు

పిరికిపందల చేష్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: కాశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లోని సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర పదజాలంతో ఖండించారు. ఈ గర్హనీయ, పిరికిపందల చర్యకు పాల్పడిన వారిని వదిలి పెట్టేది లేదని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఉగ్రవాద దాడిలో మరణించిన సైనికుల్ని దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగ ధనులుగా అభివర్ణించి వారికి అభివాదం చేశారు. వీరి సేవల్ని భారత ప్రజల నిత్యం గుర్తుంచుకుంటారని ట్వీట్ చేశారు. ‘ఆర్మీ క్యాంప్‌పై జరిగిన ఉగ్రవాద దాడిని అత్యంత కఠినమైన పదజాలంతో ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గర్హనీయ కృత్యానికి పాల్పడిన వారిని వదలి పెట్టేది లేదు’అని మోదీ పేర్కొన్నారు. ప్రాణ త్యాగం చేసిన వారికి శాల్యూట్ చేస్తున్నానని, అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని తెలిపారు.