జాతీయ వార్తలు

మరో 24 గం. కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూలై 22: అంతరిక్ష చరిత్రలోనే భారత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ అన్నారు. సోమవారం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్-2 విజయవంతం అనంతరం ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి నేరుగా మీడియా మాట్లాడారు. యావత్ దేశమంతా ఎదురుచూసిన చందయాన్-2
ప్రయోగం విజయవంతమైందన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన శాస్తవ్రేత్తలు మరోసారి మన సత్తాను నిరూపించుకున్న రోజన్నారు. ఇస్రో శాస్తవ్రేత్తలతో పాటు అందరి సమష్టి కృషివల్లే ఇంతటి గొప్ప విజయాన్ని సాధించామని సంతోషం వ్యక్తం చేశారు. అత్యంత కీలకమైన క్రయోజనిక్ దశ విజయవంతంగా ముగిసిందన్నారు. ముందుగా అనుకున్నట్లే చంద్రయాన్-2 నిర్ధేశిత కక్ష్యలోకి చేరిందన్నారు. చంద్రుడిపై భారత్ చేసిన చారిత్రాత్మక ప్రయాణం ఈ ప్రయోగమని అభివర్ణించారు. వచ్చే 24 గంటలు చాలా కీలకమన్నారు. ఆర్బిట్‌లో ఇంధనం మండించి రేజింగ్ చేసి చంద్రయాన్-2ను కక్ష్యలోకి మార్చడం పెద్ద సవాలేనని పేర్కొన్నారు. మొదట సాంకేతిక లోపం తలెత్తినప్పటికీ వారంలో రోజుల్లోనే సరిచేసి జీఎస్‌ఎల్‌వీ-మార్క్ 3 వంటి భారీ ప్రసయోగాన్ని విజయవంతం చేయడం వెనుక ఇస్రోలోని అన్ని సెంటర్ల డైరెక్టర్లతో పాటు ఉద్యోగులు అందరూ అహర్నిశలు శ్రమించారని అందుకుతగ్గ ప్రతిఫలం లభించిందన్నారు. ఈ ప్రయోగంలో మూడు ఉపగ్రహాలను ఒకే రోవర్ ద్వారా ప్రయోగించామన్నారు. ఊహించిన దానికంటే చంద్రయాన్-2 తొలి దశ ఎక్కువ విజయవంతమైందని ఆనందం వ్యక్తం చేశారు. కక్ష్యలోకి రాకెట్ చంద్రయాన్-2ను అనుకొన్న దానికంటే 6వేల కిలోమీటర్ల దూరం ఎక్కువ ఎత్తులో చేర్చిందని దీనివల్ల ఉపగ్రహం ఎక్కువ కాలం పని చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి భారీ ప్రయోగాలు చేపట్టడం వల్ల నిర్ధేశిత కక్ష్యకంటే ఎక్కువ వెళ్లేందుకు వీలుంటుందని అన్నారు. అందువల్లే మార్క్ వంటి భారీ ప్రయోగాలకు ఎన్నో పరిశోధనలనంతరం ఇస్రో ఈ ప్రయోగాలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పటికే రోదసీలో మనదే అందె వేసిన చేయి అని చంద్రమండలంలో కూడా భారత్ పతాకం ఎగరడం ఖాయమన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకెళతామని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్‌లో షార్ నుంచి మరిన్ని ప్రయోగాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. చంద్రయాన్-2 నిర్ధేశిత కక్ష్యలోకి రాకెట్ నుంచి విడిపోవడంతో మిషన్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్న శాస్తవ్రేత్తలు, మాజీ ఇస్రో చైర్మన్‌లతో శివన్ ఆలింగనం చేసుకొని అనందాన్ని పంచుకున్నారు.
చిత్రం...ఎంసీసీ నుంచి మాట్లాడుతున్న ఇస్రో చైర్మన్