జాతీయ వార్తలు

జనవరిలోనే బడ్జెట్ భేటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడం, వచ్చే ఏప్రిల్‌నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడానికి ముందే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను జనవరి 21కి నెల రోజులు ముందుకు జరపాలన్న ప్రతిపాదనపై ప్రతిపక్షాలకు ప్రభుత్వంనుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. ఈ ప్రతిపాదన గురించి రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్‌ను అడగ్గా, ‘ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై ఇప్పటివరకు మాతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు’ అని ఆయన సమాధానమిచ్చారు. కేంద్ర మంత్రివర్గం ముందుకు త్వరలో రానున్న ఈ ప్రతిపాదనను ప్రతిపక్షం ఎలా చూస్తోందన్న ప్రశ్నకు సైతం ఆజాద్ అదే రీతిలో సమాధానమిచ్చారు.
వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)ను అమలు చేయడానికి అవసరమైన చట్టాలను ఆమోదించడానికి వీలుగా ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలను ముందుగా జరపాలని ప్రభుత్వం అనుకుంటోంది. అలా చేసినట్లయితే రానున్న సంవత్సరాల్లో కూడా ఇదే ఆనవాయితీ అవుతుంది. జిఎస్‌టిని వీలయినంత త్వరగా అమలు చేయడానికి వీలుగా అవసరమైన చట్టాలను ఆమోదించడానికి ఈ ఏడాది నవంబర్ 12న పార్లమెంటు శీతాకాల సమావేశాలను జరపాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఇప్పటివరకు రైల్వేలకు విడిగా బడ్జెట్‌ను సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ విధానాన్ని రద్దు చేయడంతోపాటు ఆయా సంవత్సరాలకు ఫలితాల ఆధారంగా బడ్జెట్‌ను సమర్పించే విధానానికి మారడానికి బడ్జెట్ రూపొందించే ప్రక్రియలో సమూల మార్పులు చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుకుంటోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇప్పటివరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి నెల మూడు లేదా నాలుగో వారంలో ప్రారంభమయ్యేవి. అలాగే ఆ నెల చివరి రోజున కేంద్ర బడ్జెట్‌ను సమర్పించడం జరుగుతూ వస్తోంది. ఫలితంగా ఫిబ్రవరి, మే మధ్య రెండు విడతల్లో చట్టసభల ఆమోదం వీటికి లభిస్తోంది. అయితే కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నులకు సంబంధించిన అన్ని ప్రతిపాదనలు, అలాగే పథకాలపై ఖర్చులన్నీ కూడా ఏప్రిల్ 1వ తేదీనుంచే అమలయ్యేలా చూడడానికి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 24నే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అలాగ ఆర్థిక సర్వేను జనవరి 30న, సాధారణ బడ్జెట్‌ను 31న సమర్పించాలని అనుకుంటున్నారు. దీనివల్ల ఆ తర్వాతి రెండు నెలల కాలంలో ద్రవ్య వినిమయ బిల్లు, ఆర్థిక బిల్లులు ఆమోదం పొందడానికి వీలవుతుంది.