జాతీయ వార్తలు

ఏం చర్యలు తీసుకున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: బాలకార్మికుల పునరావాసానికి సంబంధించి ఆరు రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సి) నోటీసులు జారీ చేసిం ది. 740 మంది బాలకార్మికులకు భద్రత కల్పించే విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని కమిషన్ ఆదేశించింది. ఈమేరకు రాజస్థాన్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేస్తూ ఎనిమిది వారాల్లో దీనిపై నివేదిక అందజేయాలని విజ్ఞప్తి చేసింది. 2013 మార్చి నుంచి 2014 జూలై వరకూ రాజస్థాన్‌లోని వివిధ సంస్థల్లో వెట్టిచాకిరీ చేస్తున్న 740 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు. అందులో 610 మంది పిల్లలు బిహార్‌కు చెందినవారు. మిగతా 130 మంది జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్‌కు చెందినవారని ఎన్‌హెచ్‌ఆర్‌సి వివరించింది. అయితే బాలకార్మికుల భద్రత, పునరావాసం విషయంలో ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తూ వచ్చాయి.

వీడిన ప్రతిష్టంభన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: జమ్మూకాశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు పిడిపి-బిజెపి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ శుక్రవారం ఈ విషయాన్ని ధృవీకరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయని ఆయన వెల్లడించారు. ‘పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ, నిర్మల్ సింగ్‌ల మధ్య గురువారం జరిగిన చర్చలు ఫలించాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ఇరుపార్టీలు ఓ అభిప్రాయానికి వచ్చాయి’అని ఓ వార్తా సంస్థతో ఆయన చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ పూర్తికావస్తుందని, బహుశా రానున్న రెండు మూడు రోజుల్లో ప్రమాణస్వీకారోత్సం జరిగే అవకాశం ఉందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఏప్రిల్ 4న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని, ఈ సమాచారం గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా దృష్టికి తీసుకెళ్లినట్టు పిడిపి వర్గాలు చెప్పాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై పిడిపి-బిజెపిల మధ్య నెలకొన్న సంక్లిష్టత రామ్‌మాధవ్ ప్రకటనంతో తొలగిపోయినట్టయింది.