జాతీయ వార్తలు

క్షిపణి పరీక్షలు విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాసోర్ (ఒడిశా), సెప్టెంబర్ 20: రక్షణ సామర్థ్యానికి మరింత పదును పెట్టుకుంటూ భారత్ మంగళవారం రెండు క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. సుదూర ఉపరితల లక్ష్యాలను ఛేదించగలిగే ఈ క్షిపణులను ఇజ్రాయెల్‌తో కలిసి రూపొందించింది. మొదటి క్షిపణిని ఇక్కడి చాందిపూర్ ప్రయోగ కేంద్రం నుంచి పదిగంటల 13నిముషాలకు, రెండో క్షిపణిని మధ్యాహ్నం 2గం 25నిముషాలకు పరీక్షించామని రక్షణ అధికారులు తెలిపారు. నిర్ణీత లక్ష్యాలను రెండు క్షిపణులు ఛేదించామని, అనుకున్న విధంగానే ఈ ప్రయోగ పరీక్ష విజయవంతమైందని ఈ ప్రాజెక్టుకు చెందిన ఓ శాస్తవ్రేత్త తెలిపారు. రెండు పరీక్షల్లోనూ ఉపరితలంపై ఎగురుతున్న లక్ష్యాలను ఈ ఆధునిక క్షిపణులు నేరుగానే ఢీకొని ధ్వంసం చేశాయన్నారు. శత్రువుల ఆయుధాలను నిర్వీర్యం చేయగలిగే సత్తా కూడా వీటికుంది.