జాతీయ వార్తలు

రోజుకు 6వేల క్యూసెక్కులు వదలండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: తమిళనాడుకు బుధవారం నుంచి ఈ నెల 27వరకు రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం కర్నాటకను ఆదేశించింది. తమిళనాడుకు బుధవారంనుంచి ఈ నెల 30 తేదీ దాకా రోజుకు 3 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని కావేరి జలాల పర్యవేక్షక కమిటీ సోమవారం కర్నాటకను ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రెండు రాష్ట్రాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ఆదేశాలకోసం రెండు రాష్ట్రాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తరుణంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. అంతేకాదు, కావేరి జల వివాదాల ట్రిబ్యునల్ ఆదేశించినట్లుగా నాలుగు వారాల్లోగా కావేరి జలాల నిర్వహణ బోర్డు (సిడబ్ల్యుఎంబి)ను ఏర్పాటు చేయాలని కూడా న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ యు యు లలిత్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. బోర్డును ఏర్పాటు చేసినట్లుగా తెలిపే నోటిఫికేషన్‌ను తదుపరి విచారణ రోజున కోర్టుకు సమర్పించాలని కూడా కేంద్రాన్ని బెంచ్ ఆదేశించింది. ‘ఎంతకాలం ఈ రెండు రాష్ట్రాలు కొట్టుకోవాలి? ఈ వివాదం 1984నుంచి కూడా ఉంది. సిడబ్ల్యుఎంబి అనేది నిపుణుల కమిటీ. దీన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇంతకుముందు సమస్య తలెత్తలేదు గనుక భవిష్యత్తులో సమస్య ఎప్పటికీ తలెత్తదని భావించరాదు’ అని బెంచ్ కేంద్రం తరఫున హాజరయిన అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్‌కు చెప్పింది. పర్యవేక్షక కమిటీ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరని విషయాన్ని, కమిటీ చైర్మన్, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశి శేఖర్ తన అధికారాలను ఉపయోగించి తమిళనాడుకు రోజుకు 3వేల క్యూసెక్కులు విడుదల చేయాలని ఆదేశించిన విషయాన్ని బెంచ్ పరిగణనలోకి తీసుకుంది. కాగా, తమ తాగునీటి సరఫరానుంచి తమిళనాడుకు నీళ్లివ్వలేమని కర్నాటక తరఫున వాదించిన ప్రముఖ న్యాయ కోవిదుడు ఎఫ్ ఎస్ నారిమన్ చెప్పారు. కాగా, పర్యవేక్షక కమిటీ ఆదేశాలు జారీ చేసే ముందు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని తమిళనాడు తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ శేఖర్ నాఫాడే అన్నారు.

చిత్రం.. సుప్రీం తీర్పు నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
కర్నాటక-తమిళనాడు సరిహద్దు అట్టిబేలి వద్ద మోహరించిన బిఎస్‌ఎఫ్ జవాన్లు