జాతీయ వార్తలు

బాధ ఉన్నా.. గర్విస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, సెప్టెంబర్ 20: ‘మా పిల్లలు దేశంకోసం ప్రాణత్యాగం చేయడం నాకు గర్వంగా ఉంది’ అంటూ బిహార్‌కు చెందిన ముగ్గురు సైనికుల తల్లిదండ్రులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. కుమారుల్ని కోల్పోయిన బాధ ఒకపక్క తమను కుంగదీస్తున్నా, వారు చేసిన అత్యున్నత త్యాగం తాము ఉప్పొంగేలా చేస్తోందని పేర్కొన్నారు. దేశంకోసం తన బిడ్డ ప్రాణాలు అర్పించడాన్ని గర్విస్తున్నానని ఊరి దాడిలో మరణించిన అశోక్ కుమార్ సింగ్ అనే సైనికుడి తండ్రి స్పష్టం చేశారు. 80 సంవత్సరాల జగ్ నారాయణ్ సింగ్ తన మొదటి కుమారుడ్ని ఉగ్రవాద దాడిలోనే కోల్పోయాడు. 20ఏళ్లుగా కళ్లు కనిపించని స్థితిలో ఉన్న జగ్ నారాయణ్ సింగ్ తన మొదటి కుమారుడు కూడా సైన్యంలోనే పనిచేశాడని, 23 సంవత్సరాలకే ఉగ్రవాదుల దాడిలో మరణించాడని గుర్తుచేసుకున్నాడు. తన కుమారులు దేశంకోసం ప్రాణ త్యాగం చేయడం ఎంతో గర్వంగా ఉందని చెప్పిన ఆయన, పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. దేశంకోసం ప్రాణత్యాగం చేసిన ఇద్దరు కుమారులను చూసి ఏ తండ్రైనా గర్విస్తాడని పేర్కొన్న ఆయన, పాకిస్తాన్‌ను మాత్రం వదిలిపెట్టడానికి వీల్లేదని డిమాండ్ చేశారు.

చిత్రం.. సునీల్ కుమార్ విద్యార్థి శవ పేటిక వద్ద ఆయన భార్య, కుమార్తెలు, బంధువులు