జాతీయ వార్తలు

అన్నీ ఆలోచించాకే నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/శ్రీనగర్ సెప్టెంబర్ 20: పద్ధెనిమిది మంది జవాన్లను దొంగదాడి చేసి హతమార్చిన పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలపై ఎలా వ్యవహరించాలన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో, శ్రీనగర్‌లో కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షి నాయకత్వం జమ్ము కాశ్మీర్‌తోపాటు దేశమంతటా నెలకొన్న పరిస్థితులపై అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాలు జరిగాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఎలాంటి చర్య చేపట్టాలన్నా పూర్తిస్థాయిలో ఆలోచించిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెణ్ రిజిజు మంగళవారం వ్యాఖ్యానించారు. ‘ఎలాంటి చర్యలైనా ప్రకటనలు చేసి తీసుకోరు. ఇది చాలా తీవ్రమైన అంశం. యుద్ధవాతావరణం సృష్టించే మాటలు మనం మాట్లాడవద్దు. చాలామంది ప్రాణాలు పోయాయి. ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి విషయాల్ని తేలిగ్గా తీసుకోలేం’ అని రిజిజు వ్యాఖ్యానించారు.
రాజధాని ఢిల్లీలో హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జమ్ముకాశ్మీర్‌లో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జయశంకర్, హోం, రక్షణ శాఖలు, పారామిలటరీ బలగాల ఉన్నతాధికారులు, నిఘా వర్గాల అధిపతులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. కాశ్మీర్ లోయలో, వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితిని వారు రాజ్‌నాథ్‌కు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో విదేశాంగ శాఖ కార్యదర్శి పాల్గొనటం ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్‌పై దౌత్యపరమైన దాడి చేయటానికి సన్నద్ధమవుతున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. వాస్తవాధీన రేఖ, పాక్‌తో అంతర్జాతీయ సరిహద్దు రేఖ వద్ద భద్రతా పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ జనవరిలో పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వాయుసేన క్యాంప్‌పై ఉరీ సెక్టార్ తరహా దాడే జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్‌కు వ్యూహాత్మకంగా సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతోంది. పఠాన్‌కోట్ దాడి సందర్భంలో అనుసరించిన విధంగానే, ఉరీ దాడికి సంబంధించి నలుగురు ఉగ్రవాదులకు చెందిన సాక్ష్యాలు, పాకిస్తాన్ ముద్రలున్న ఆయుధాలు, ఆహార పొట్లాలు, ఎనర్జీ డ్రింక్‌లు, జిపిఎస్ ట్రాకర్లను పాక్‌కు అందజేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరోపక్క జమ్ము కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షి గవర్నర్ ఎన్‌ఎన్ ఓరా, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో సమావేశమయ్యారు. లోయలో శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించారు. ఆ తరువాత భద్రతాబలగాలు, నిఘా వర్గాల అధిపతులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు.
కేసు నమోదు చేసిన ఎన్‌ఐఏ
ఉగ్రవాదులు దాడి చేసి 18మంది సైనికులను హతమార్చిన ఘటనపై జాతీయ దర్యాప్తు బృందం కేసు నమోదు చేసింది. కేసు దర్యాప్తును ఎన్‌ఐఏ బృందం జమ్ము కాశ్మీర్ పోలీసుల నుంచి తన చేతుల్లోకి తీసుకుంది. ఉరీ సెక్టార్‌లో దాడికి సంబంధించిన సాక్ష్యాధారాలను స్వాధీనం చేసుకుంది. దాడి చేసిన నలుగురు ఉగ్రవాదుల నుంచి సేకరించిన ఆయుధాలు, రెండు మొబైల్ సెట్లు, రెండు జిపిఎస్ పరికరాలను ఎన్‌ఐఏ బృందం తమ అధీనంలోకి తీసుకుంది. చనిపోయిన టెర్రరిస్టుల డిఎన్‌ఏ శాంపిళ్లను కూడా సేకరించనుంది. దర్యాప్తు బృందం సేకరించిన జిపిఎస్ పరికరాల్లో ఒకటి పూర్తిగా చెడిపోగా మరొకటి బాగానే ఉందని, సాంకేతిక నిపుణుల సహాయంతో ఉగ్రవాదులు ఉరీ సెక్టార్‌లో స్థానికంగా ఎవరి సాయమేదైనా తీసుకున్నారా లేదా అన్నది విచారిస్తారు. దాడికి సంబంధించి ఒక నివేదిక రూపొందించి లాంచనంగా పాకిస్తాన్‌కు అందజేస్తారు. నలుగురు ఉగ్రవాదులను గుర్తించాల్సిందిగా కోరతారు. ఈ ఘటనపై సైన్యం కూడా విచారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

చిత్రాలు..కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెణ్ రిజిజు

శ్రీనగర్‌లో మంగళవారం కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తితో
సమావేశమైన కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షి