జాతీయ వార్తలు

అనుమతులు లేని ఎత్తిపోతలు ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ అనుమతుల్లేని ఎత్తిపోతల పథకాల పనులు నిలిపివేయాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. గోదావరి నదిపై ధవళేశ్వరం బ్యారేజ్ ఎగువన పర్యావరణ అనుమతులు లేకుండా పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడి, తాటిపూడి, గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ఎత్తిపోతల పధకాలను చేపట్టారని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, శ్రీనాథ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ ఈ ఆదేశాలిచ్చింది. దీనిపై పలు దఫాలుగా జస్టిస్ ఆదర్శకుమార్ నేతృత్వంలో సమావేశమైన త్రిసభ్య బెంచ్ మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. పర్యావరణ అనుమతులు లేని గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధాన ఎత్తిపోతల పథకాలు నిలిపివేయాలని స్పష్టం చేసింది. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతుంటే ఏం చేస్తున్నారని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర పర్యావరణ శాఖను బెంచ్ ప్రశ్నించింది. ఈ ఎత్తిపోతల పథకాలపై ఆయా బోర్డులతో ఓ సంయక్త కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక మేరకు విచారణ చేపట్టిన బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది.