జాతీయ వార్తలు

జయ, మమతల వైపే మళ్లీ మొగ్గు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో జయలలిత, మమతా బెనర్జీలు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారం కోసం కాంగ్రెస్, బిజెపిలు తీవ్రంగా పోటీపడుతున్న అస్సాంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడేందుకు అవకాశం ఉందని తాజాగా జరిగిన ఎన్నికల సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కేరళలో కాంగ్రెస్ సారధ్యంలోని యుడిఎఫ్‌ను సాగనంపి ప్రజలు ఎల్‌డిఎఫ్‌కు పట్టంగట్టే అవకాశం ఉందని ఈ సర్వే ఫలితాలను వెల్లడిస్తూ ఇండియాటివి ఓ ప్రకటన జారీ చేసింది. సి-ఓటరుతో కలిసి ఈ సర్వే నిర్వహించింది.
126 సీట్లున్న అస్సాంలో బిజెపి సారధ్యంలోని కూటమికి 55 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అలాగే అధికార కాంగ్రెస్‌కు 53 సీట్లకు మించి రాకపోవచ్చని సర్వే స్పష్టం చేసింది. అంటే బిజెపికి అధికారంలోకి రావడానికి 9 సీట్లు తక్కువైతే కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో వచ్చిన సీట్లకంటే 25 సీట్లు తక్కువ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కేరళలో ప్రతిపక్ష ఎల్‌డిఎఫ్ 86 సీట్లు గెలుచుకుని 140 స్థానాలున్న అసెంబ్లీలో పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న యుడిఎఫ్‌కు 53 సీట్లకు మించి రాకపోవచ్చని వెల్లడించింది. ఇక బిజెపి నేతృత్వంలోని కూటమికి కేరళలో ఒక్క సీటు మాత్రం దక్కే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 160 సీట్లు వరకూ గెలుచుకోవచ్చని గత ఎన్నికల్లో గెలుచుకున్న సీట్లకంటే ఈసారి 24 స్థానాలు దీనికి తగ్గే అవకాశం ఉందని సర్వే ఫలితాలు తెలిపాయి. ఇక ఉమ్మడిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్, వామపక్షాలకు 106, 21 సీట్లు చొప్పున దక్కే అవకాశం ఉంది. రాష్ట్రంలో బిజెపికి నాలుగు సీట్లకు మించి రాకపోవచ్చని సర్వే తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 42 సీట్లు గెలుచుకుంటే ఈ సారి ఆ సంఖ్య సగానికి సగం పడిపోయే అవకాశం ఉంది. తమిళనాడులో జయలలిత సారధ్యంలోని అన్నాడిఎంకె కూటమి 130 సీట్లు గెలుచుకుని మెజారిటీతో అధికారం మళ్లీ చేజిక్కించుకునే అవకాశం ఉంది. కలిసిపోటీ చేస్తున్న కాంగ్రెస్, డిఎంకెలకు 70 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే వివరాలు స్పష్టం చేస్తున్నాయి.