జాతీయ వార్తలు

చొరవ చూపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: గోదావరి, ప్రాణహిత నదుల పరీవాహక అటవీ ప్రాంతాలకు రహదారుల నిర్మాణం కోసం రూ.300 కోట్లు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సహాయం, చేపట్టాల్సిన కార్యక్రమాల విషయంలో చొరవ చూపాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కోరారు. గురువారం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కూడా కెసిఆర్ కలుసుకున్నారు. నియోజకవర్గాల సంఖ్య పెంపునకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆయన్ని కోరారు. విభజన చట్టం పదో షెడ్యూల్‌లోని సంస్థ ల విభజనపై తలెత్తిన సమస్యలు హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరుగుతున్న విషయాన్ని కూడా తెలిపారు.ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో గోదావరి, ప్రాణహిత నదుల వెంట జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.1290కోట్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని అనుమతులు పొందిన ఈ రహదారుల నిర్మాణ పనులకు అర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అమోద ముద్ర వేసేందుకు చొరవచూపాలని కోరారు. ఈ రెండు వినతులతో కూడిన పత్రాలను రాజ్‌నాథ్‌కు కేసీఆర్ అందజేశారు. అదేవిధంగా కాళేశ్వరం నుంచి అర్జున్‌గుట్ట వరకు రహదారి, సోమని గుడెం రహదారి, గూడెం-బాబా సాహెబ్ రహదారుల నిర్మాణానికి ఎల్‌డబ్యూఈ (లెఫ్ట్‌వింగ్ ఎక్స్‌ట్రిమిసమ్) కింద రూ.300కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కోరారు. నక్సల్ ప్రభావిత అటవీ ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి ఈ రహదారుల నిర్మాణం అత్యవసరమని వివరించారు.
కలిసి పనిచేయాలి
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రజాప్రతినిధులంతా రాజకీయాలకు అతీతంగా పని చేయాల్సిన అవసరం ఉందని కెసిఆర్ అన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోవడానికి కేంద్రం నుంచి అందాల్సిన సహాయం, పథకాలు, నిధులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో అందేలా చూడాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయను కోరారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు, సహచర మంత్రులతో మాట్లాడి పెండింగ్‌లో వున్న పనుల విషయంలో తగిన చొరవ చూపాలనీ విజ్ఞప్తి చేశారు. గురువారం దత్తాత్రేయ నివాసంలో ముఖ్యమంత్రి కెసీఆర్ ఆయనను కలిశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో వున్న పనుల జాబితాను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి అందించారు. వెనుకబడిన జిల్లాలకు అందాల్సిన రెండోవిడత ఆర్థిక సహాయం విడుదలయ్యేలా చూడాలని, రామగుండంలో ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా శంఖుస్థాపన చేసినందున, వెంటనే పనులు ప్రారభం అయ్యేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరారు. సమావేశం అనంతరం బండారు దత్తాత్రేయ విలేఖరులతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా కేంద్ర మంత్రులతో మాట్లాడి పెండింగ్ పనులు త్వరగా జరిగేలా చూస్తానని చెప్పారు. తెలంగాణపట్ల కేంద్రానికి సానుభూతి, ప్రేమ వున్నాయని,కేసీఆర్ పట్ల ప్రధానితోసహా కేంద్రంలోని అందరికీ ప్రత్యేక అభిమానం, గౌరవం వున్నాయన్నారు.

చిత్రం.. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి కెసిఆర్