జాతీయ వార్తలు

అమిత్ షాతో దోవల్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ సోమవారం ఢిల్లీలో హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. 370 అధికరణ రద్దు చేసినప్పటి నుంచి కాశ్మీర్‌లోనే మకాం వేసి వ్యక్తిగతంగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న దోవల్.. దాదాపు పది రోజుల తరువాత మొదటిసారిగా అమిత్‌షాతో సమావేశమయ్యారు. ఆగస్టు ఐదో తేదీ నుంచి ఇప్పటివరకు కాశ్మీర్‌లో నెలకొన్న శాంతి భద్రతలపై దోవల్ అమిత్‌షాతో సమీక్షించారు.
హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబాతో పాటు ఉన్నతాధికారులు సైతం సమీక్షలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకొన్నదీ ఈ సమీక్షలో అమిత్ షాకు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో విధించిన ఆంక్షల అంశాన్ని కూడా ప్రస్తావించారు. 370 అధికరణ రద్దు చేసినప్పటి నుంచి సమాచార వ్యవస్థలో చేపట్టిన ఆంక్షలతో పాటు ప్రజల జీవన విధానం ఏ రకంగా ఉందన్న అంశంపై కూడా చర్చ జరిగింది.
ఇదో సరికొత్త ‘సాధారణ పరిస్థితి’
జమ్మూ కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి అన్న దానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్వచనం చెబుతోంది అంటూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర హోం మంత్రి చిదంబరం ఎద్దేవా చేశారు. క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయన్న ప్రభుత్వ వాదనను ఆయన ఖండించారు. దీనిని ‘సరికొత్త సాధారణ పరిస్థితి’గా అభివర్ణించారు. జమ్మూ కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితిపై ఆయన మాట్లాడుతూ ‘స్కూళ్లు తెరిచారు. కానీ విద్యార్థులు ఉండరు.అంతా బాగుంది అంటారు.. ఇంటర్నెట్‌ను మరోసారి స్తంభింపజేశారు.. మెహబూబా ముఫ్తీ కుమార్తెను గృహ నిర్బంధం చేశారు.. ఆమె ప్రశ్నిస్తే సమాధానం లేదు.. పరిస్థితి సవ్యంగా ఉంది అంటే ఇదేనా’ అంటూ చిదంబరం విరుచుకుపడ్డారు.