జాతీయ వార్తలు

దార్శనికుడు రాజీవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: శాంతి, సామరస్యం, జాతీయ సమగ్రత కోసం అవిరళంగా కృషి చేసిన మహానాయకుడని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని పలువురు నేతలు అభివర్ణించారు. రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా అనేక మంత్రి మంగళవారం ఘన నివాళి అర్పించారు. రాజీవ్ గాంధీ సంస్మరణ కేంద్రమైన వీర్‌భూమిలో జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ప్రసంగాలకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్‌లను ప్రసారం చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీవ్ జన్మ పంచ సప్తతి పురస్కారాలను పలువురు వ్యక్తులు, సంస్థలకు ప్రదానం చేశారు. సోనియా, రాహుల్ గాంధీ ఈ సందర్భంగా దివ్యాంగులకు వాహనాలు, స్కూటర్లు పంపిణీ చేశారు. అలాగే, రాజీవ్ జ్ఞాపకాలతో కూడిన ఓ ఎగ్జిబిషన్‌ను కూడా వారు ప్రారంభించారు. తన తండ్రి రాజీవ్ గాంధీ దార్శనీకుడని, దేశభక్తుడని, నవభారత నిర్మాణానికి దూరదృష్టితో కూడిన ఎన్నో పథకాలను అమల్లోకి తెచ్చారని రాహుల్ ఈ సందర్భంగా అన్నారు. సామరస్యం, క్షమాగుణం, అందర్నీ ప్రేమించే తత్వాన్ని రాజీవ్ గాంధీ తనకు అందించారని ఆయన ట్వీట్ చేశారు. ప్రజలందరి హృదయాల్లో నిలిచిపోయేలా ఎలా ఉండాలో తన తండ్రి తనకు నేర్పించారని ప్రియాంక ట్వీట్ చేశారు. అసహన, దేశాన్ని ముక్కలు చేసే ధోరణుల వల్ల రాజకీయ వ్యవస్థ దెబ్బతింటోందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పెడధోరణులు శాంతి, జాతీయ సమగ్రత, మతసామరస్యాలకు విఘాతం కలిగిస్తాయని ఆయన అన్నారు.

చిత్రాలు.. రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా మంగళవారం న్యూఢిల్లీలోని వీర్‌భూమిలో ఘన నివాళి అర్పిస్తున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, వాద్రా కుటుంబ సభ్యులు